అపార్ట్‌మెంట్‌ కిటికీ నుంచి 500 నోట్ల వర్షం ఏమైందో తెలిసే లోపే ట్విస్ట్‌..!!

ఒడిసా రాజధాని భువనేశ్వర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ వద్ద కరెన్సీ వర్షం కురిసింది. ఒక్కసారిగా గాల్లో 500 నోట్లు ఎగరడంతో అక్కడ ఉన్నవారంతా షాక్ అయ్యారు. ఒడిసా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో చీఫ్‌ ఇంజనీర్‌గా పని చేస్తోన్న బైకుంఠ నాథ్ సారంగిఈ కరెన్సీ వర్షం కురిపించాడు.విజిలెన్స్‌ అధికారులు తన ఇంటికి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఈ ఇంజనీర్ ఇంట్లోని నోట్ల కట్టలను ఇదిగో ఇలా కిటికీలోంచి బయటపడేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. బైకుంఠనాథ్ ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు రావడంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి సోదాలు చేపట్టారు.

సారంగి నివాసముంటున్న ఫ్లాట్‌ తో సహా ఆయన నివాసాలు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇళ్లలో అధికారులు ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఈ క్రమంలో తాను అక్రమంగా సంపాదించిన డబ్బు బయటపడకూడదనే ఉద్దేశంతో సారంగి తన ఇంటి కిటికీలో నుంచి 500 నోట్ల కట్టలు బయటికి పారేశాడు. మొత్తంగా ఈ సోదాల్లో2 కోట్ల రూపాయలను అధికారులు సీజ్‌ చేశారు. విజిలెన్స్ అధికారులు కరెన్సీ కట్టలను లెక్కబెడుతున్న వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.