మోడీ, వాట్ నెక్స్ట్…?

కొడితే ఏనుగు కుంభస్థలమే అనేలా తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి ఇండియన్ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్. మోడీ వరుస మీటింగ్స్.. చూస్తుంటే ట్రంప్ మరోసారి జోకర్‌గా మారడం పక్కాగా కనిపిస్తోంది. అదే జరిగితే భారత్ నెక్ట్స్ టార్గెట్‌ ఏమై ఉంటుంది? భారత్‌ అమ్ములపొదిలో నుంచి తీయబోయే తరువాతి అస్త్రం ఏంటి?

గిల్లితే గిల్లించుకోవాలి అంటాడు ఓ మూవీలో ఓ యాక్టర్.. ఒకప్పుడు భారత్ అలానే ఉండేది. కానీ ఇప్పుడలా కాదు.. నువ్వు గిల్లితే చావు దెబ్బ కొట్టడమే అంటోది. దానికి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్ ఆపరేషన్ సిందూర్. ఉగ్రవాదులు దాడులు చేశారు.. ఉగ్ర స్థావరాలపై దాడులు జరిగాయి.. అది కూడా భయానకంగా. కానీ తమలో ఒక విభాగమైన ఈ ఉగ్ర క్యాంప్‌లపై దాడులను తట్టుకోలేకపోయింది పాక్ ఆర్మీ. వెంటనే భారత్‌పై దాడులు మొదలు పెట్టింది. తెలిసిందే కదా.. ఇది నయా ఇండియా. చావు దెబ్బ కొట్టింది. ఎంతలా అంటే.. ప్రస్తుతం పాకిస్థాన్‌ ఆర్మీ యుద్ధం చేయాలన్న కీలక స్థావరాలు ఉపయోగించుకునే పరిస్థితిలో లేనంతగా.

యుద్ధానికి ముందు భారత్‌పై మొండి మీసాలు మెలేసిన పాక్‌..యుద్ధం మొదలయ్యాక.. మెడలు వంచింది. భారత్‌ను ఓడిస్తాం..ఆయుధాలతో నిలువరిస్తాం అని..బీరాలు పలికిన పాక్‌కు భారత్‌ షాకుల మీద షాకులిచ్చింది. ఏ ఎయిర్‌బేస్‌లను చూసి పాపి విర్రవీగిందో..ఇప్పుడు అవే ఎయిర్‌బేస్‌లను భారత ఆర్మీ భూస్థాపితం చేసింది. మే 9వ తేదీ ఖచ్చితంగా పాకిస్థాన్‌ హిస్టరీలో ఒక కాళరాత్రి అని చెప్పాలి. పాకిస్థాన్‌లోని కీలక ఎయిర్‌బేస్‌లను నేలమట్టం చేస్తూ.. పాక్‌ గర్వాన్ని అణగదొక్కింది. మొత్తం 8 ఎయిర్‌బేస్‌లను భారత ఆర్మీ భూస్థాపితం చేసింది.

ఇంటర్నేషనల్ బార్డర్.. LoC వెంబడి ఉన్న భారత ఆర్మీ పోస్టులపై కాల్పులు.. అమాయక ప్రజల ఇళ్లపై మోర్టార్స్ షెల్స్ ప్రయోగించడం.. సామాన్య ప్రజల ప్రాణాలు తీయడం.. ఇలాంటి చర్యలన్నింటికి సమాధానం ఈ దాడులు. అయినా పాపిస్థాన్‌కు బుద్ధి రాలేదు. మెడిన్ చైనా, తుర్కియా మిసైల్స్‌, డ్రోన్లను నమ్ముకొని దాడులు చేసింది. దీంతో ఇండియన్ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ కన్ను పాకిస్థాన్ న్యూక్లియర్ సైట్స్‌పై పడినట్టు తెలుస్తోంది.

ఎప్పుడైతే భారత్‌ నెక్ట్స్ పాకిస్థాన్ న్యూక్లియర్ కమాండ్ అండ్ కంట్రోల్‌పై ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌పై దాడులు చేస్తోందని తెలిసిందో.. పాక్‌ వెంటనే అమెరికా కాళ్ల దగ్గర పడింది. అక్కడి నుంచి సీన్ మారింది. ఇక్కడ అమెరికా చేసిన సూచన ఒకటే.. నేరుగా భారత్‌తో హాట్‌లైన్‌లో మాట్లాడి మ్యాటర్ సెటిల్‌ చేసుకోవాలని అప్పుడు వచ్చింది ఈ ఒప్పందం.

కానీ పాక్ తోక వంకర కదా.. వెంటనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ విషయం భారత్‌కు ముందే తెలుసు కదా. తమను గిల్లితే ఎలా ఉంటుందో మరోసారి చూపించింది. మరోసారి దాడులు మొదలయ్యాయి. దెబ్బకు మళ్లీ దెయ్యం వదిలింది.

పాక్‌ గురించి తెలుసు.. దాని నక్క వినయాలు.. జిత్తులమారి బుద్ది గురించి తెలుసు. అందుకే ఇకపై ఏ ఉగ్రదాడి జరిగినా.. దానిని యుద్ధంగానే పరిగణించాలని డిసైడ్ అయ్యింది భారత్. అంతేకాదు ప్రస్తుత పరిస్థితిపై త్రివిధ దళాదిపతులతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ భేటీ అయ్యారు. ఈ బేటీలు చూస్తుంటే.. మళ్లీ ఏదో పెద్దగానే జరిగే చాన్స్ ఉంది. అలా జరగాలంటే పాక్ ఒక తప్పు చేయాలి. ఆ తప్పు జరగడమే ఆలస్యం.. చావు దెబ్బ తీసేందుకు సిద్ధంగా ఉన్నాయి త్రివిధ దళాలు.

మరోసారి భారత్‌పై దాడులు జరిగితే.. ఇకపై ఎవరి మాట వినే పరిస్థితిలో లేదు భారత్. ఇప్పటికే ఇదే విషయాన్ని అమెరికాకు తేల్చి చెప్పారు ప్రధాని మోడీ. తమపై దాడి జరిగితే ప్రతి దాడి జరుగుతుంది.. అలాంటి సమయంలో ఉగ్రవాదులను అప్పగించడం.. POJKను వదులు కోవడం తప్ప పాకిస్థాన్ వద్ద మరే ఆప్షన్ ఉండదు.. ఇందులో ఏ దేశం జోక్యం చేసుకోకూడదు.. అని కూడా మోడీ తేల్చి చెప్పారు.

అటు వైపు నుంచి తూటా వస్తే.. తాము కూడా తూటతోనే సమాధానం చెబుతాం ఇది అమెరికాకు మోడీ ఇచ్చిన క్లారిటీ. పాక్‌కు ప్రతి అడుగులో ఓటమే ఎదురైంది.. భారత్‌తో పోటీ పడే సత్తా లేదని పాకిస్థాన్‌కు కూడా అర్థమైంది. ఇకపై ఉగ్రవాదుల విషయంలో సాధారణంగా వ్యవహరించమని.. గతంలోలాగా చిన్న చిన్న క్యాంప్‌లపై కాకుండా.. ఏకంగా ఉగ్రసంస్థల హెడ్‌క్వార్టర్లపైనే దాడులు చేశామన్నారు మోడీ.

ఇప్పటికే ఇండియన్ ఆర్మీ దెబ్బకు సరిహద్దుల్లోని అన్ని పాక్‌ ఎయిర్‌ బేస్‌లు ఆపరేషన్ స్టేజ్‌ను కోల్పోయాయి. అయినా కానీ బరితెగిస్తే.. చావు దెబ్బ తప్పలేదు. మొన్నటి వరకు ఎయిర్‌బేస్‌లు అన్నారు. తుక్కు తుక్కుగా చేసి వదిలిపెట్టారు. ఇప్పుడు న్యూక్లియర్ బాంబులు అంటున్నారు. మరి ఇప్పటికే దానికి కౌంటర్‌ ప్లాన్‌ను భారత్ రెడీగా చేసి పెట్టుకుందా? ఏమో కాలమే సమాధానం చెప్పాలి.