విజయ్ రూపానీ లక్కీ నంబర్ 1206 సీక్రెట్ ఇదే..!

నంబర్లు మ్యాజిక్ చేస్తాయని చాలా మంది నమ్ముతారు.. ఈ మధ్యకాలంలో సంఖ్యా శాస్త్రాన్ని ఫాలో అవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏ పని మొదలుపెట్టినా..ఎక్కడికి వెళ్లాలన్నా నంబర్లను చూసుకొని చేసే వారు భారత దేశంలో చాలా మందే ఉన్నారు. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానికి ఓ లక్కీ నంబర్ ఉంది. ఆ నంబర్ అంటే ఆయనకు చాలా ఇష్టం. కాదు..కాదు ప్రాణం. ఆయన తిరిగే కార్లకు, స్కూటర్లకు ఆఖరికీ ఫ్లైట్ లో ఆయన కూర్చున్న సీట్ నెంబర్ కూడా అదే. కానీ…ఆయన లక్కీ నంబరే ఇప్పుడు ఆయనకు దురదృష్ట సంఖ్యగా మారింది. ఆ లక్కీ నంబర్ వచ్చే రోజునే ఆయన ఘోర విమాన ప్రమాదంలో చనిపోయారు.దీంతో ఆ లక్కీ నంబర్ పై చర్చ మొదలైంది. దీంతో ఆ నంబర్ వెనకున్న సీక్రెట్ ఏంటో తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు.

విజయ్ రూపానీ లక్కీ నెంబర్ 1206. ఈ నంబర్ అంటే ఆయనకు ప్రాణం. దాదాపు ఆయన వాడే ప్రతి కారు నంబర్ ప్లేట్లపై ఈ నెంబర్ ఉంటుంది. అంతెందుకు ఆయన స్కూటర్ నంబర్ కూడా అదే. తాజాగా ప్రమాదానికి గురైన బోయింగ్ విమానంలో ఆయన కూర్చున్న సీట్ నంబర్ 12…అది ఆయన లక్కీ నంబర్ లోని మొదటి రెండు నంబర్లతోనే స్టార్ట్ అయ్యింది. . అంతేకాదు.. ఆయన జర్నీ చేసే విమానం డిపార్చర్ సమయం 12.10. సోర్స్ ప్రకారం విజయ్ రూపానీ Z క్లాస్ టికెట్ తీసుకున్నారు. Z క్లాస్ అంటే బిజినెస్ కేటగిరీకి చెందినది. ఇక ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో Z… 26వ సంఖ్య. ఇందులో కూడా.. 1206 లోని.. 2, 6 నంబర్లు ఉన్నాయి. ఇలా ప్రతి దాంటో ఆయన తన లక్కీ నంబర్ ఉండేలా చూసుకుంటారని అర్థమవుతోంది. కానీ ఆయన గమనించని విషయం ఏంటంటే.. ఏ నంబర్ అయితే ఆయన లక్కీ అనుకున్నారో.. అదే సంఖ్య ఆయనకు అన్ లక్కీగా మారింది. ఎందుకంటే అదే నంబర్ వచ్చే రోజున ఆయన చనిపోయారు. నిన్న జూన్ 12 అంటే.. 12 06 అయ్యింది. దీంతో నెటిజన్లు ఆయన లక్కీ నంబరే ఆయనకు దురదృష్ట సంఖ్యగా మారిందని అంటున్నారు.

1956 ఆగస్ట్ 2న అప్పటి బర్మా ప్రస్తుత మయన్మార్ లో ని రంగూన్ లో జన్మించారు విజయ్ రూపానీ. ఆ తర్వాత దేశంలోని రాజకీయ అస్థిరతల కారణంగా తన ఫ్యామిలీతో కలిసి గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు వలస వచ్చారు. సౌరాష్ట్ర వర్శిటీ నుంచి బీఏ, ఎల్ఎల్‌బీ చేశారు.ఆ టైమ్ లోనే ఆర్‌ఎస్‌ఎస్‌లో యాక్టివ్‏గా ఉండేవారు. ఆర్‌ఎస్‌ఎస్ స్టూడెంట్ విభాగమైన ఏబీవీపీ ద్వారా స్టూడెంట్ పాలిటిక్స్ లోకి వచ్చారు. 1987లో రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేటర్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 1996లో రాజ్‌కోట్ మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. బీజేపీ పట్ల ఆయనకున్న విధేయత ఆయన్ని రాష్ట్ర రాజకీయాల్లో కీలక వ్యక్తిగా నిలబెట్టాయి.ఇదే క్రమంలోనే, అప్పటి ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ తన పదవి నుంచి తప్పుకోవడంతో ఆగస్ట్ 2016లో ఆయన వారసుడిగా రూపానీ సీఎం అయ్యారు. తన మృదు స్వభావం, దృఢమైన పరిపాలనా శైలితో కీలక సమయాల్లో గుజరాత్‌ను సమర్థవంతంగా నడిపించారు. ఆయన సీఎంగా ఉన్నంత కాలం పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సంక్షేమ పథకాల అమలుకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. ఆయన గుజరాత్ మాజీ సీఎం గా ఉంటూ పార్టీకి బలమైన బ్యాక్ బోన్ గా ఉన్నారు అలాంటి ఆయన తాజాగా అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయారు.

2027లో గుజరాత్ లో ఎన్నికలు జరుగనున్నాయి. గత మూడున్నర దశాబ్దాలుగా గుజరాత్ ను బీజేపీనే ఏలుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లను ఆమ్ ఆద్మీ పార్టీ లాగేసుకోవడంతో బీజేపీ లాభపడింది. ఇక ఈసారి జరిగే ఎన్నికల్లో ఆప్ పోటీ చేయదని సమాచారం. దాంతో గుజరాత్ లో కాంగ్రెస్ కి మంచి అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ప్రధాని మోదీ , అమిత్ షా ఇద్దరూ గుజరాత్ కి చెందిన వారే . అందుకే ఆ పార్టీకి అక్కడ గెలుపు చాలా ముఖ్యం. అలాంటి తరుణంలో బీజేపీకి చెందిన కీలక నేత మాజీ సీఎం విజయ్ రూపానీ దుర్మరణంతో పార్టీకి చాలా నష్టం కలుగుతుందని అంటున్నారు. దశాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తూ విలువలకు కట్టుబడి ఉన్న విజయ్ రూపానీ లాంటి నాయకులను తిరిగి తెచ్చుకోవడం ఆయన ప్లేస్ ను భర్తీ చేయడం కష్టమని అంటున్నారు. ఒక వైపు రాహుల్ గాంధీకి గుజరాత్ లో జనాదరణ పెరుగుతోంది.ఇంతటి కీలక పరిస్థితుల్లో విజయ్ రూపాని మరణాన్ని కమలనాధులు జీర్ణించుకోలేకపోతున్నారు.