
Uttarakhand CM Pushkar Singh: రాష్ట్ర పాలన పగ్గాలు చేపట్టిన ఓ ముఖ్యమంత్రి.. కాడెద్దులను చేత పట్టి గొర్రు కొట్టారు. ఆపై స్వయంగా తన హస్తాలతో నాటు కూడా వేశారు. అయితే ఇదంతా చేసిందే మరే ముఖ్యమంత్రో కాదు. మన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి. తన సొంత వ్యవసాయ భూమిలో వరి నాటు వేసి.. అన్నదాతల స్ఫూర్తికి, శ్రమను మరోసారి గుర్తు చేశారు. ఖతిమాలోని నగ్రా తెరాయ్ ప్రాంతంలో సీఎం ధామి స్వయంగా పొలం పనుల్లో పాల్గొనడం, రైతులతో కలిసి సంప్రదాయ ఆచారాలను పాటించడం ప్రజలను ఆకట్టుకుంది.

ఉత్తరాఖండ్ ఖతిమాలోని నగ్రా తెరాయ్ ప్రాంతంలో ఉన్న.. తన సొంత వ్యవసాయ భూమిలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి ఈ పనులు చేశారు. సామాన్య రైతులు చేసే పద్ధతిలో పనులు చేస్తూ.. వరి నాటారు. కాడెద్దులతో పొలంలోకి దిగి గొర్రు కొట్టి.. ఆపై అక్కడి రైతులతో కలిసి మరీ నాటు వేశారు. అంతకు ముందే.. అక్కడి సంస్కృతి, కట్టుబాట్లను గౌరవిస్తూ సంప్రదాయ పద్ధతుల్లో పూజలు నిర్వహించారు. ఆపైనే పనులు ప్రారంభించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. Uttarakhand CM Pushkar Singh.

పొలంలో వరి నాటడం తన చిన్ననాటి రోజులను గుర్తు చేసిందని సీఎం ధామి అన్నారు.. ఈ అనుభూతి చాలా గొప్పది” అని తెలిపారు. రైతులు కేవలం ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక మాత్రమే కాదని, వారు దేశ సంస్కృతికి, సంప్రదాయాలకు వాహకులని ఆయన నొక్కి చెప్పారు. వారి శ్రమ, నిస్వార్థ సేవకు నివాళులర్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సీఎం గుర్తు చేశారు.

వరుస సమావేశాలూ, అధికారిక సమీక్షలతో నిత్యం బిజీబిజీగా ఉండే సీఎం పుష్కర్ సింగ్ దామి రైతుగా మారడంతో దేశ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాఖండ్ రైతులు అయితే.. సీఎం ఉత్తరాఖండ్ గ్రామీణ ప్రాముఖ్యతను గుర్తించినట్లుగా భావిస్తున్నారు. ఇది పాలనకు, సామాన్య ప్రజలకు మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. దేశవ్యాప్తంగా ఖరీఫ్ సీజన్‌కు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో.. మారుతున్న రుతుపవన నమూనాలకు అనుగుణంగా ఇలాంటి కార్యక్రమాలు రైతులను ప్రోత్సహిస్తాయని ఆశిస్తున్నారు.