మాక్‌డ్రిల్ అంటే ఏమిటి..?

మాక్ డ్రిల్ అంటే ఏంటి. గతంలో దేశ వ్యాప్తంగా ఎప్పుడు చేశారు. అది కూడా చూద్దాం. దాదాపు 50 సంవత్సరాల తర్వాత దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. కార్గిల్ యుద్ధ సమయంలో కేవడం సరిహద్దు రాష్ట్రాలైన జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలకే ఈ మాక్ డ్రిల్ పరిమితమైంది. కానీ ఈసారి దేశమొత్తం నిర్వహిస్తున్నారు. ఇక 1971లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధ సమయంలో కూడా మాక్ డ్రిల్ నిర్వహించారు. అలాగే 1965, 1962 యుద్ధాల సమయంలో కూడా మాక్ డ్రిల్ చేపట్టారు. అంతేకాదు, 1971 యుద్ధ సమంయలో తాజ్ మహల్ మొత్తం ఆకుపచ్చని టార్పాలిన్స్ తో కప్పేశారు. ఇలాంటి జాగ్రత్తలే ఎర్రకోట, కుతుబ్ మినార్, జైసల్మేర్ కోట దగ్గర కూడా తీసుకున్నారు. ఇక ఈ మాక్ డ్రిల్ నిర్వహణ వెనుక బలమైన కారణాలు కూడా ఉన్నాయి. గగనతల దాడుల హెచ్చరిక సామర్థ్యాన్ని అంచనా వేయడం ఒకటైతే, వాయుసేన హాట్ లైన్, రేడియో కమ్యూనికేషన్ని వాడుకలో తేవడం రెండోది. అలాగే కంట్రోల్ రూం, షాడో కంట్రోల్ రూ పనితీరు కూడా తెల్సుకోవచ్చు.