భారత్, ఇజ్రాయెల్ ప్లాన్స్ ఒకటేనా..?

Operation Sindoor & Rising Lion: భారత్, ఇజ్రాయెల్ రెండు మిత్ర దేశాలు. రక్షణ, వ్యహాత్మక విషయాల్లో వీటి మధ్య సహకారం ఎంతో ఉంటుంది. అందుకే భారత్ పాకిస్థాన్ పై , ఇజ్రాయెల్ ఇరాన్ పై చేసిన ఆపరేషన్లు కూడా ఒకేలా ఉన్నాయేమో. ఈ రెండు దేశాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్, రైజింగ్ లయన్ పాకిస్థాన్, ఇరాన్‌పై సంచలన విజయం సాధించాయి. ఈ ఆపరేషన్లలో ఒక్క ఫైటర్ జెట్‌నూ కోల్పోకుండా, ఖచ్చితమైన దాడులతో శత్రు దేశాల వైమానిక స్థావరాలను ధ్వంసం చేశారు. అసలు భారత్, ఇజ్రాయెల్ రెండూ ఒకేలా దాడులు చేయడం ఎలా చూడొచ్చు..? పాకిస్థాన్, ఇరాన్ ఎందుకు ఈ రెండు దేశాలను ఎందుకు ఎదుర్కోలేకపోయాయి?

మొన్న పాకిస్థాన్ పై ఇండియా ఆపరేషన్ సిందూర్.. నిన్న ఇరాన్ పై ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయిన్ ను క్షణంగా పరిశీలిస్తే.. దాడులు చేసే తీరు ఒకేలా అనిపిస్తుంది. ఆపరేషన్ సింధూర్, రైజింగ్ లయన్ పాకిస్థాన్, ఇరాన్‌ల వైమానిక సామర్థ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేశాయి. భారత్ మే 7 నుంచి 10 వరకు పాకిస్థాన్‌లోని ఎనిమిది వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో భారత్ రఫేల్ జెట్‌ల నుంచి స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్స్, హామర్ బాంబులు, బ్రహ్మోస్ మిసైల్స్, హరోప్ డ్రోన్‌లను ఉపయోగించింది. ఇజ్రాయెల్ జూన్ 13 నుంచి ఇరాన్‌పై దాడులు ప్రారంభించి, ఎఫ్-35ఐ స్టెల్త్ జెట్‌లతో ఇరాన్ ఎస్-300, రాడార్‌లను బాంబులతో నాశనం చేసింది. ఈ ఆపరేషన్లలో భారత్, ఇజ్రాయెల్ రెండు దేశాలు ఒక్క జెట్‌ను కూడా కోల్పోకుండా, పాకిస్థాన్‌ను 38 గంటలు, ఇరాన్‌ను 120 గంటలపాటు గగనతలపై నియంత్రణ కోల్పోయేలా చేశాయి. ఈ దాడులు శత్రు దేశాల రాడార్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను నిర్వీర్యం చేసి, వాటి వైమానిక శక్తిని పూర్తిగా తగ్గించాయి. అధునాత ఆయుధాలు, నెట్‌వర్క్-సెంట్రిక్ వార్‌ఫేర్, రియల్-టైమ్ ఇంటెలిజెన్స్ సర్వీలెన్స్ రికనైసెన్స్ ఇంటిగ్రేషన్‌పై ఆధారపడి ఈ ఆపరేషన్లు జరిగాయి. అంటే ఇవి ఆధునిక యుద్ధ వ్యూహాల్లో కీలకంగా చెబుతున్నారు. గతంలో మాదిరి ఎదురెదురు యుద్ధాలు చేస్తే పనిచేయవని పాకిస్థాన్, ఇరాన్ కు భారత్, ఇజ్రాయెల్ చూపించాయి.

పాకిస్థాన్, ఇరాన్‌లు ఈ దాడులకు ప్రతిఘటించలేకపోవడానికి ఆర్థిక బలహీనత, పాత వైమానిక విమానాలు, సక్రమంగా పనిచేయని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. పాకిస్థాన్‌లోని రాడార్, సర్ఫేస్-టు-ఎయిర్ మిసైల్ సిస్టమ్స్‌ను భారత్ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్ స్పెక్ట్రా ద్వారా పనిచేయకుండా చేశారు. దీనివల్ల పాకిస్థాన్ యుద్ధ విమానాలు గగనతలంలోకి రాలేకపోయాయి. కేవలం ముక్కుబడిగా కొన్ని జెట్‌లను మాత్రమే పంపింది. భారత్ ఎస్-400 సిస్టమ్స్ భయం కూడా పాకిస్థాన్‌ను వెనక్కి లాగింది. అటు ఇజ్రాయెల్ ఎఫ్-35ఐ జెట్‌లు ఇరాన్ రాడార్‌లను పనిచేయకుండా చేసి, ఎస్-300, టోర్-ఎమ్1 సిస్టమ్స్‌ను ధ్వంసం చేశాయి. ఇరాన్ ఎఫ్-14, మిగ్-29 వంటి యుద్ధ విమానాలు ఒక్కటి కూడా గగనతలంలోకి రాలేదు. ఇరాన్ కేవలం బాలిస్టిక్ మిసైల్స్, హెజ్బొల్లా వంటి ప్రాక్సీ గ్రూపుల ద్వారా ప్రతిస్పందించింది. సాటిలైట్ ఇమేజుల ప్రకారం, పాకిస్థాన్, ఇరాన్‌లోని వైమానిక స్థావరాలు, రన్‌వేలు, మిసైల్ సైలోలు ధ్వంసమయ్యాయి, ఎటువంటి వైమానిక కదలికలూ లేవు. ఈ ఆపరేషన్లు శత్రువు యుద్ధ సామర్థ్యంతో పాటు, రాజకీయ, సైనిక సంస్థాగత సామర్థ్యాన్ని పూర్తిగా దెబ్బతీశాయని చెప్పొచ్చు.

అసలు భారత్ ఈ ఆపరేషన్ ఎందుకు ఎలా చేసింది..?
ఆపరేషన్ సింధూర్ మే 7న పాకిస్థాన్‌లోని బహవల్పూర్, మురిద్కేలో ప్రారంభమైంది. ఈ దాడులు ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా చేపట్టారు. భారత్ నిర్దేశించిన తొమ్మిది ఉగ్రవాద కేంద్రాలపై ఖచ్చితమైన దాడులు చేసింది. నూర్ ఖాన్ ఎయిర్‌బేస్, రావల్పిండిలోని పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ సమీపంలో ఉండటం వల్ల కీలకమైనది. ఈ స్థావరంలోనే ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, సీ-130 ట్రాన్స్‌పోర్టర్స్, ఐఎల్-78 రీఫ్యూయలింగ్ విమానాలు ఉన్నాయి. మే 8-10 మధ్య బ్రహ్మోస్ మిసైల్స్, హరోప్ డ్రోన్‌లతో ఎనిమిది స్థావరాలను భారత్ లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడులు పాకిస్థాన్ గగనతలాన్ని 38 గంటలపాటు మూసివేసేలా చేశాయి. అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దుతో పాకిస్థాన్ కు భారీ ఆర్థిక నష్టం కలిగింది.

ఇజ్రాయెల్ కూడ భారత్ ఫార్ములాను ఫాలో అయ్యిందా..?
ఇజ్రాయెల్ జూన్ 13న ఆపరేషన్ రైజింగ్ లయన్‌ను ప్రారంభించింది. ఎఫ్-35ఐ స్టెల్త్ జెట్‌లు ఇరాన్ గగనతలంలోకి చొచ్చుకెళ్లి, ఎస్-300, బవర్-373 ఎస్‌ఏఎమ్ సిస్టమ్స్, రాడార్‌లను ధ్వంసం చేశాయి. 72 గంటల్లో 200కు పైగా దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండ్ పోస్ట్‌లు, నాటాంజ్, ఫోర్డో వద్ద అణు సౌకర్యాలు, మిసైల్ బేస్‌లు నాశనమయ్యాయి. ఇరాన్ గగనతలాన్ని 5 రోజులు మూసివేశారు. కొన్ని నో-ఫ్లై జోన్‌లు ఆ తర్వాత కూడా కొనసాగాయి. ఈ దాడులు ఇరాన్ అణు కార్యక్రమాన్ని నెలలు లేదా సంవత్సరాల పాటు వెనక్కి నెట్టాయి. ఇరాన్ రాడార్ సిస్టమ్స్ దెబ్బతినడంతో, ఇరాన్ యుద్ధ విమానాలు గగనతలంలోకి రాలేకపోయాయి. ఇరాన్ కేవలం బాలిస్టిక్ మిసైల్స్, హెజ్బొల్లా వంటి ప్రాక్సీ గ్రూపుల ద్వారా ప్రతిస్పందించింది, కానీ ఇవి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ సిస్టమ్‌తో నిర్వీర్యమయ్యాయి. ఈ దాడులు ఇరాన్‌లో ఆర్థిక, సామాజిక అస్థిరతను మరింత తీవ్రతరం చేశాయి, దీనివల్ల అంతర్గతంగా ప్రజల నుంచి అసంతృప్తి, ఆందోళనలు పెరిగాయి. Operation Sindoor & Rising Lion.

భారత్, ఇజ్రాయెల్ ఆపరేషన్లు పాకిస్థాన్, ఇరాన్‌లపై గగన విజయం సాధించడమే కాక, రాజకీయ, ఆర్థికంగా భారీ ప్రభావం చూపాయి. పాకిస్థాన్ గగనతలం 38 గంటలపాటు మూతపడటం వల్ల 57 అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. దీనివల్ల ఆర్థిక నష్టంతో పాటు అంతర్జాతీయ విమానయాన రంగంలో దాని విశ్వసనీయత దెబ్బతింది. చైనా రాడార్ సిస్టమ్స్‌పై ఆధారపడిన నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ దాడి, చైనా సైనిక టెక్నాలజీపై ప్రశ్నలు లేవనెత్తింది. ఇరాన్‌లో 120 గంటల గగనతల మూసివేత వల్ల వాణిజ్య విమానాల ఆదాయం కోల్పోయింది. అణు సౌకర్యాల నాశనం దాని అంతర్జాతీయ రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసింది. ఈ విజయాలు భారత్, ఇజ్రాయెల్‌ల సైనిక, రాజకీయ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటాయి, అదే సమయంలో పాకిస్థాన్, ఇరాన్‌ల బలహీనతలను బహిర్గతం చేశాయి.

Also Read: https://www.mega9tv.com/national/bjp-handing-over-the-post-of-national-president-of-the-high-command-to-a-female-leader/