మెగా సునామీ.. వంగా జ్యోతిష్యం.!

Baba Vanga Prophecy: ఈ ప్రపంచంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందని ముందే కొందరు జ్యోతిష్యులు అంచనా వేస్తుంటారు. అయితే కరోనా వస్తుందని ముందుగానే గ్రహించి 20 ఏళ్ల కిందట తన పుస్తకంలో బాబా వంగా రాశారు. సరిగ్గా రాసినట్లు జరగడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు బాబా వంగా పేరు మారు మ్రోగుతుంది.

మరికొన్ని గంటల్లో జపాన్‌లో సునామీ వస్తుందని, దేశం అంతం అవుతుందని బాబా వంగా తన పుస్తకంలో రాశారు. జూలై 5వ తేదీన ప్రళయం వస్తుందని కోట్లాది మంది ప్రజలు చనిపోతారని, ప్రపంచ పటంలో జపాన్ ఉండని పుస్తకంలో ఉంది. దీంతో జపాన్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ బాబా వంగా తన ప్రిడిక్షన్‌లో సునామీ గురించి ఏం రాశారు? నిజంగానే సునామీ వస్తుందా.. ఈ ప్రపంచం అంతం అవుతుందా.. లేకపోతే కేవలం జపాన్ అంతం అవుతుందా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. Baba Vanga Prophecy About Corona.

జూలై 5వ తేదీన ప్రళయం వస్తుందని జపాన్‌కు చెందిన న్యూ బాబా వంగా తన ప్రిడిక్షన్‌లో రాశారు. జపాన్, ఫిలిప్పీన్స్ దేశాల మధ్య సముద్ర గర్భంలో ఒక చీలిక ఏర్పడుతుందని, ఈ సునామీలో కోట్లాది మంది ప్రజలు చనిపోతారని ఆ బుక్‌లో బాబా వంగా రాశారు. ఇకపై జపాన్ దేశం ప్రపంచ పటంలో ఉండదని బాబా వంగా పుస్తకంలో రాసి ఉంది. ప్రసిద్ధ ఆర్టిస్ట్ రియో టక్స్ కీని జపాన్ బాబా వంగా అని పిలుస్తారు. ఇతను 1999లో ది ఫ్యూచర్ ఐసా లో అనే పుస్తకం రాశారు. ఇందులో భవిష్యత్తులో ఏం జరగబోతుందని దివ్యదృష్టితో చూసి పుస్తకంలో రాశారు. అయితే మొదట్లో ఈమె పెద్ద ఫేమస్ కాలేదు. కానీ కాలక్రమేణా ఆమె రాసినవి అన్ని జరగడంతో బాగా పాపులారిటీ వచ్చింది. ఇప్పుడు జూలై 5వ తేదీన జపాన్‌లో సునామీ వస్తుందని రాసి ఉంది.

అయితే మరోవైపు టాట్సుకి అంచనాలను బలంగా విశ్వసించే పర్యాటకులు జపాన్‌కు వెళ్లేందుకు బయపడుతున్నారు. ఆ దేశానికి వెళ్ళే విమాన బుకింగ్‌లు భారీగా రద్దయ్యాయి. ఎంతగా అంటే జూన్‌ చివరి, జూలై తొలి వారాల్లో హాంకాంగ్ నుంచి జపాన్‌కు విమాన రిజర్వేషన్లు 83 శాతం పడిపోవడంతో ఆ దేశ పర్యాటక రంగం కుదేలు అయింది. దీంతో జపాన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అయితే రియో ఆ దేశం గురించి వేసిన అంచనాలతో అక్కడ సునామీ బీభత్సం సృష్టించినా సృష్టించక పోయినా.. ఆమె చెప్పిన భవిష్యత్ ఇప్పుడు ఆ దేశ పర్యాటక రంగంపై మాత్రమే కాదు ఆర్ధిక పరిస్థితిపై కూడా భారీ ప్రభావాన్ని చూపిస్తుంది.

ఇప్పటి వరకు బాబా వంగా చెప్పిన కొన్ని విషయాలు నిజమయ్యాయి. 1995లో కోబ్ భూకంపం, 2011 తోహోలో భూకంపం, 2020లో కరోనా వైరస్, ఫ్రెడ్డీ మెర్క్యూరీ మరణం కూడా బాబా వంగా తన పుస్తకంలో రాశారు. ఇవన్నీ నిజం కావడంతో ఇప్పుడు జపాన్ సునామీ కూడా వస్తుందని, ఇక అంతం అయిపోతుందని జపాన్ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మరి ఇది నిజం అవుతుందో లేదో చూడాలి.