బెజవాడ దుర్గమ్మకు ఆషాడమాస తొలి సారె…!

First Ashada Month For Goddess Kanaka Durga: ఆషాడమాసంలో ఇంద్రకీలాద్రి అమ్మవారికి తొలి సారె ను శినానాయక్ దంపతులు సమర్పించారు. మేలతాళలతో మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి సారే అందించారు. పసుపు కుంకుమ పువ్వులు, గాజులు, చలిమిడి , గోరింటాకు అమ్మవారికి శేష వస్త్రాలను తమ చేతుల మీదుగా అందించడం ఆనందంగా ఉందని ఈవో తెలిపారు.

ప్రతి ఏటా ఆషాడ మాసంలో అమ్మవారిని తమ పుట్టింటికి రమ్మని వేడుకుంటూ సారె సమర్పిస్తారు. ఇంద్రకీలాద్రి ఈ మాసం నెల రోజులపాటు అంగరంగ వైభవంగా సారే సమర్పణ కార్యక్రమాలు జరుగుతాయి.

తెలంగాణ నుండి అమ్మవారికి 29వ తేదీన బంగారు బొనాం రానుంది. ఇక ఈ ఆషాడ మాసంలోనే అమ్మవారికి శాఖాంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. జులై 8 ,9, 10 తేదీలలో శాకంబరీ ఉత్సవాలను నిర్వహించనున్నారు. అదే విధంగా ఈరోజు నుంచి నెల రోజులపాటు ఇంద్రకీలాద్రిపై వారాహి ఉత్సవాలు జరుగుతాయి. The First Ashada Month For Goddess Kanaka Durga..!

Also Read: https://www.mega9tv.com/devotional/charity-or-donation-dana-is-categorized-into-three-types-in-hindu-mythology/