ఇదెక్కడి మాస్.. బీర్ తాగుతూ వాదనలు.!

Gujarat Senior Lawyer: ఆన్ లైన్ కోర్టు విచారణల్లో లాయర్లు, కక్షిదారులు విచిత్రమైన వేషాలు వేస్తున్నారు. ఓ కేసు విచారణ జరుగుతోంది. ఆ కేసులో ఓ సీనియర్ లాయర్ వాదిస్తున్నారు. వర్చువల్ హియరింగ్ కు హాజరయ్యారు. ఆ లాయర్ హాయిగా బీర్ సిప్ చేస్తూ.. వాదించారు. తాజాగా గుజరాత్ హైకోర్టులో ఓ సీనియర్ లాయర్ బీర్ తాగుతూ తన కేసులో వాదనలు వినిపించిన వ్యవహారం వైరల్ గా మారింది.

గుజరాత్‌లో ఈ ఆసక్తిరక ఘటన చోటుచేసుకుంది. ఓ సీనియర్ న్యాయవాది బీర్‌ తాగుతూ క్లయింట్ తరపున వాదనలు వినిపించారు. దీంతో గుజరాత్ హైకోర్టు చర్యలకు దిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే జూన్ 26న న్యాయమూర్తి జస్టిస్ సందీప్‌ భట్ ధర్మాసనం ఓ కేసుపై విచారణ జరుపుతోంది. ఆ సమయంలో పిటిషనర్ తరఫున న్యాయవాది భాస్కర్ తన్నా వాదనలు వినిపించేందుకు వర్చువల్‌గా హాజరయ్యారు. అయితే చేతిలో మగ్గుతో బీరు తాగుతూనే ఆయన వాదనలు వినిపించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

నెటిజన్లు ఆయనపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. చివరికి ఆయన ప్రవర్తనను హైకోర్టు ధిక్కరణగా భావించి సుమోటాగా స్వీకరిస్తున్నట్లు గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తులు జస్చిస్ ఎ.ఎస్‌ సుపేహియా, జస్టిస్ ఆర్‌.టి వచ్చానీల ధర్మాసనం ప్రకటన చేసింది. అలాగే భాస్కర్‌కు ఉన్న సీనియర్ న్యాయవాది హోదాను కూడా పునఃపరిశీలిస్తామని ధ్వజమెత్తింది. ఇక నుంచి తమ ఎదుట వర్చువల్‌గా వాదనలు వినిపించేందుకు అవకాశం ఉండదని తేల్చిచెప్పింది. Gujarat Senior Lawyer.

కేసు వర్చువల్ విచారణ సందర్భంగా న్యాయవాది భాస్కర్ తన్నా ఫోన్‌లో మాట్లాడుతూ, బీర్ తాగుతూ వాదనలు వినిపించిన తీరు కోర్టును ధిక్కరించినట్లుగా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదని హైకోర్టు డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలోనూ వైరల్ అయిందని న్యాయమూర్తి జస్టిస్ సుపేహియా తెలిపారు. భాస్కర్ తన్నాకు ఇక సీనియర్ న్యాయవాది హోదాను కలిగి ఉండే అర్హత లేదన్నారు. తదుపరిగా జరిగే విచారణలో దీనిపై ఓ నిర్ణయాన్ని తీసుకుంటామని వెల్లడించారు. భాస్కర్ తన్నాపై సుమోటోగా కోర్టు ధిక్కార కేసు నమోదుకు రిజిస్ట్రీకి హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. రెండు వారాల తర్వాత దీనిపై వాదనలు వింటామని, ఆలోగా వర్చువల్ విచారణ వేళ భాస్కర్ తన్నా ప్రవర్తనా శైలిపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి సమర్పించాలని రిజిస్ట్రీకి ధర్మాసనం నిర్దేశించింది. ఈ నేపథ్యంలో న్యాయవాది భాస్కర్ తన్నాకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వర్చువల్ విచారణ వేళ అభ్యంతరకర ప్రవర్తనపై వివరణ కోరింది. న్యాయస్థానాల వర్చువల్ బెంచ్‌ల ఎదుట వాదనలు వినిపించకుండా ఆయనపై బ్యాన్ విధిస్తున్నట్లు ప్రకటించింది.

Also Read: https://www.mega9tv.com/national/digital-india-internet-usage-increased-in-rural-areas-with-average-speed-of-100-300-mbps-in-2025/