
లాస్ ఏంజిల్స్ ఒలంపిక్స్ పోరుటో క్రికెట్ ఆటకు చోటు ఖరారైంది. 2028లో జరిగే ఒలంపిక్స్ పోటీల్లో కొత్తగా ఐదు క్రీడలకు అవకాశం కల్పించారు నిర్వాహకులు. దీంతో 128 సంవత్సరాల తర్వాత ఒలంపిక్స్ పోటీల్లో క్రికెట్ మళ్లీ సందడి చేయనుంది. 1900 పారిస్ వేదికగా జరిగిన విశ్వక్రీడల్లో తొలిసారిగా క్రికెట్ చేరింది. ఇక లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ పోరులో టీ 20 ఫార్మెట్లో క్రికెట్ టోర్నీ నిర్వహించనున్నారు. పురుషులు, మహిళల విభాగాల్లో ఆరు జట్లు పోటీ పడుతున్నాయి. ఇందుకు సంబంధించిన క్వాలిఫైడ్ ప్రక్రియను త్వరలో ఖరారు చేయనున్నారు. ఆతిథ్య హోదాలా అమెరికా ఇప్పటికే బెర్త్ ఖరారు చేసుకుంది. దీంతో మిగతా ఐదు స్థానాల కోసం ప్రపంచ జట్లు పోటీ పడనున్నాయి. కటాఫ్ తేదీ ముందు ఐసీసీ ర్యాంకింగ్ ప్రకారం టాప్ 5 జట్లు ఒలంపిక్స్ టోర్నీలో ఆడే అవకాశం దక్కనుంది. ఐసీసీ ఈవెంట్ల తరహాలో ప్రతి టీంలో 15 మంది ఆటగాళ్లు ఉంటారు. ఇక ఈసారి రికార్డ్ స్థాయిలో 351 మెడల్ ఈవెంట్ల నిర్వహించాలని అంతర్జాతీయ ఒలంపిక్స్ కమిటీ ఎగ్జిక్యూటీవ్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది.ఈ ఒలంపిక్స్ పోటీల్లో క్రికెట్ ఆటతో పాటు సాఫ్ట్ బాల్, స్క్వాష్, ఫ్లాగ్ ఫుట్ బాల్, లక్రాస్ ఆటలకు చోటు దక్కింది.