
రోబోట్స్ మనుషుల్ని అనుకరించే పనిచేస్తాయని మనందరికి తెలిసిందే. అయితే ఇటీవల గుర్రంలా పరుగెత్తే ఏఐ రోబోట్స్ సైతం వచ్చేశాయి. కానీ పక్షిలా ఎగిరే రోబోట్‌ను మాత్రం ఎవరూ చూసి ఉండరు. కాగా ప్రస్తుతం అది కూడా వచ్చేసింది. నిజానికి మనుషులు పెరుగుతున్నారు. వారి జీవనొపాధికోసం కొత్త కొత్త టెక్నాలజీలను సృష్టిస్తున్నారు. కగా ఆ టెక్నాలజీ ఇప్పుడు మరింత డెవలప్ అవుతూ అద్భుతాలు చేస్తోంది. అనేక విషయాల్లో మానవులకు సౌకర్యంగా మారుతోంది. ఇంతకి కొత్త టెక్నాటజీతో పక్షిల ఎగిరే రోబోట్ ఏంటంటే..అదే పక్షిలా ఎగిరే రోబోటిక్ డ్రోన్!
డ్రోన్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ అవి మరీ ఎక్కువ దూరం వెళ్లలేవు. కొన్ని వెళ్లినా టెక్నికల్ ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి. ఎగురుతున్నప్పుడు సాంకేతిక లోపాలవలన అవి కిందపడిపోతాయి. కానీ అలాంటి ఆటంకాలను సైతం అధిగమిస్తూ నిర్దేశిత గమ్యాన్ని పక్షిలా ఎగిరే రోబోటిక్ డ్రోన్‌ను కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ఇంజినీర్లు కట్ కోస్కీ అండ్ డేవిడ్ లెంటింక్ డెవలప్ చేశారు. కాగా “స్టేరియోటైప్యాడ్ నేచర్ ఇన్ స్పైర్డ్ ఏరియల్ గ్రాస్పర్ ఈజ్ స్నాగ్ (SNAG)” అని పిలువబడే ఈ అధునాతన రోబోటిక్ డ్రోన్‌ను తయారు చేసి జనాలలోకి తీసుకొచ్చేందుకు వారు అనేక సంవత్సరాలుగా పరిశోధనలు జరుపుతున్నారు. ఎట్టకేలకు పక్షిలా చెట్లపై కూర్చోవడం, గాలిలో ఎగరడం, వస్తువులను మోసుకెళ్లడం వంటి పనులు చేయగల బర్డ్ ఇన్‌స్పైర్డ్ రోబోటిక్ డ్రోన్ ను ఆవిష్కరించారు.