
హీరో మోటోకార్ప్ దేశంలోనే ప్రముఖ ద్విచక్ర వాహనతయారీదారు సంస్థగా అత్యంత ప్రజాదరణ పొందింది. అయితే ఇప్పుడు స్ల్పెండర్ ప్లస్ 2025 మోడల్ ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ అద్భుతమైన లుక్ లో కనిపిస్తుంది. చిన్న చిన్న మార్పులను మాత్రమే చేసింది. అయినా కూడా కస్టమర్లను ఈ బైక్ చాలా ఆకట్టుకుంటుంది. స్ప్లెండర్ ప్లస్ లైనప్ లో స్ల్పెండర్ ప్లస్, స్ల్పెండర్ ప్లస్ ఎక్స్ టెక్, స్ల్పెండర్ ప్లస్ ఎక్స్ టెక్ 2.0 వేరియంట్లను తీసుకువచ్చింది.
ఓల్డ్ మోడల్ బైక్ లో ఏ ఇంజిన్ అయితే ఇచ్చారో ఈ స్ల్పెండర్ ప్లస్ 2025మోడళ్లలోనూ దాన్నే కొనసాగించారు. ఫేజ్ 2 ఓబీడీ 2బీ ప్రమాణాలకు అనుగుణంగా ఇంజిన్ న్ తీర్చిదిద్దారు. 2025 ఏప్రిల్ 1 తర్వాత విక్రయించే వాహనాలన్నీ ఈ ప్రమాణాలను పాటించాల్సిందే. దీనిలో 4 స్పీడ్ గేర్ బాక్స్ కూడా ఉంది. ఇది 7. 91బీహెచ్పీ పవర్ ను , 8న05 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. గ్రాఫిక్స్ పరంగా కొన్ని మార్పులను చేసి, స్పోర్టీ లుక్ ను జోడించారు. ఇక హీరో స్ల్పెండర్ ప్లస్ మొత్తం 6 రకాల వేరియంట్లలో లభిస్తుంది. స్ల్పెండర్ ప్లస్ డ్రమ్, స్ల్పెండర్ ప్లస్ ఐ3 , స్ల్పెండర్ ప్లస్ ఐ 3ఎస్, బ్లాక్ అండ్ యాక్సెంట్, స్ల్పెండర్ ప్లస్ టెక్స్ టెక్ డ్రమ్ బ్రేక్, స్ల్పెండర్ ప్లస్ ఎక్స్ టెక్ డిస్క్ బ్రేక్ , స్ల్పెండర్ ప్లస్ ఎక్స్ టెక్ 2.0డ్రమ్ బ్రేక్ ఆప్షన్స్ లో లభిస్తుంది. బేస్ వేరియంట్ ధర రూ. 79, 096 ఉండగా హైఎండ్ వేరియంట్ ధర రూ. 86.,051గా కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్, హోండా షైన్ 100, బజాజ్ ప్లాటినా 100 వెహికల్స్ తో ఈ స్ప్లెండర్ పోటీ పడుతోంది.