అన్నీ సర్వీసులు ఒకే చోట.. Rail One సూపర్ యాప్..!

Indian Railway Super App: రైలు టికెట్ల కోసం బుకింగ్ యాప్ ఒకటి.. ప్లాట్ఫామ్ టికెట్లకు మరో యాప్.. జర్నీలో ఫుడ్ బుకింగ్ కోసమైతే ఇంకో యాప్.. ట్రైన్ లైవ్ ట్రాకింగ్, ప్రయాణంలో సాయానికి.. ఇలా ఒక్కో అవసరానికి ఒక్కో యాప్ వాడుతూ వచ్చాం. ఇకపై ఈ అన్నీ అవసరాల కోసం.. అన్ని సర్వీస్ ల కోసం ఒక్క చోట ఉండేలా ఇండియన్ రైల్వేస్ ఓ సరికొత్త యాప్ ను అయితే మనకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే ‘రైల్వన్’ (Rail One) సూపర్ యాప్. దీన్ని ఎలా ఉపయోగించాలి.. ఎలాంటి సర్వీసులను అందిస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం: Indian Railway Super App ( Rail One )

  • ప్లే స్టోర్ యాప్ లేదా స్టోర్ నుంచి Rail One యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.
  • మొదటి స్క్రీన్ లో ఆడిగిన వివరాలను ఇచ్చి యూజర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
  • రిజర్వేషన్, అన్ రిజర్వ్డ్, ప్లాట్ఫామ్ టికెట్లను ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
  • రిజర్వేషన్ ఆప్షన్ లో ఐఆర్ సీటీసీ యాప్ లో బుక్ చేసుకున్నట్లే అన్ని క్లాస్ ల టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
  • అన్ రిజర్వ్డ్ ఆప్షన్ లోకి వెళ్లి సాధారణ టికెట్లు, సీజనల్ పాస్ లను బై చేయవచ్చు.
  • యూటీఎస్ యాప్ లో ప్లాట్ఫామ్ టికెట్ బుక్ చేయడానికి స్టేషన్ కు మనం నిర్ణీత దూరంలో ఉన్నప్పుడే అయ్యేది. కానీ ఈ యాప్ లో ఆ దూరం లిమిట్ అనేది లేదు.
  • ఐఆర్ సీటీసీ యాప్ లో రైళ్ల సమాచారం, బుకింగ్ అనేవి ఒకే విండోలో ఉండేవి. ఈ యాప్ లో మీకావాల్సిన రూట్లో రైళ్లను వెతుక్కునే ఆప్షన్ ఉంది.
  • థర్డ్ పార్టీ యాప్ ల అవసరం లేకుండా రైళ్ల లైవ్ ట్రాకింగ్ చూసుకోవచ్చు. ఎంత శాతం జర్నీ పూర్తయింది, తర్వాత ఆగే స్టేషన్ ఏది, వచ్చే స్టేషన్ ఏది.. లాంటి వివరాలు ఈజీగా తెలుసుకోవచ్చు.
  • సీటు ఒక దగ్గర బుక్ అవ్వడం, ఫుడ్ ఇంకో చోట బుక్ అవ్వడం లాంటి పరిస్థితి ఇక ఏర్పడదు. ఈ యాప్ లోని ‘ఆర్డర్ ఫుడ్‘ అనే ఆప్షన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ పెట్టొచ్చు.
  • రైలులో ప్రయాణికుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ‘రైల్ మదద్’ ఫీచర్ కూడా ఈ యాప్ లోనే యాడ్ చేశారు.
  • ప్రయాణం ఎలా సాగింది? రైల్వే స్టేషన్ ఎలా ఉంది? అనే విషయంపై ఫీడ్ బ్యాక్ ఇవ్వాలనుకుంటే.. రైల్వేకు ఈ యాప్ ద్వారా తెలియజేయవచ్చు. అలానే రేటింగ్ కూడా ఇవ్వొచ్చు.
  • ఆర్- వాలెట్ లో డబ్బులు వేసి, తర్వాత టికెట్ బుకింగ్ సమయంలో యూస్ చేసుకోవచ్చు.
  • ఎక్కువగా ప్రయాణించేవారి వివరాలను గతంలో మాస్టర్ లిస్ట్ గా పిలిచేవారు. దానిని ఈ యాప్ లో సేవ్ పాసింజర్ లిస్ట్ గా మార్చారు.
  • ఇవే కాకుండా పీఎన్ఆర్ స్టేటస్, రైళ్ల కోచ ల లిస్ట్, రిఫండ్ ప్రాసెస్ లాంటి సదుపాయాలు ఈ యాప్ లో ఉన్నాయి.

Also Read: https://www.mega9tv.com/technology/tatkal-tickets-booking-is-only-for-those-who-completed-aadhar-authentication-also-hdfc-credit-rules-changed/