ఫేస్ బుక్ లో వీడియోలన్నీ.. ఇకపై రీల్స్ ఫార్మాట్ లోనే వస్తాయి!

Facebook Videos On Reels Format: పాపులర్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ అయిన ఫేస్‌బుక్‌ తాజాగా వీడియో షేరింగ్‌ విధానంలో కొన్ని కీ చేంజెస్ చేసింది. ఇకపై అప్‌లోడ్‌ చేయనున్న వీడియోలన్నీ రీల్స్‌ ఫార్మాట్‌లో మాత్రమే అప్‌డేట్‌ అవుతాయని తెలిపింది. చిన్న వీడియో నుంచి లెన్త్‌ వీడియో వరకూ వీడియోలన్ని రీల్స్‌ ఫార్మాట్‌లోనే పబ్లిష్‌ అవుతాయని క్లారిటీనిచ్చింది.

యూజర్లు వీడియో కంటెంట్‌ను ఎలా క్రియేట్ చేయాలనేది.. చూసే విధానాన్ని అంటే, ఫీడ్ ను బట్టి పూర్తిగా మార్చే దిశలో ఈ మార్పు చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం యూజర్లు తమ వీడియోను రీల్‌గా పోస్ట్‌ చేయాలనుకుంటున్నారా? జనరల్ వీడియో పోస్ట్‌ చేయాలనుకుంటున్నారా? అని డిసైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రెండింటికీ వేర్వేరు ఎడిటింగ్‌ టూల్స్‌ ఉన్నాయి. కానీ, ప్రస్తుతం మెటా నిర్ణయం తర్వాత రీల్స్‌.. సాధారణ వీడియో పోస్ట్‌ మధ్య తేడా తెలుస్తుంది. ఇకపై వీడియోలన్నీ స్పెషల్‌ సిస్టమ్‌ ద్వారానే డీల్ చేస్తారు. ఇందులో రీల్‌ డ్యూరేషన్, ఫార్మాట్‌లపై ఉన్న పారామీటర్స్ తీసేయనున్నారు.

ఇప్పటివరకు ఫేస్‌బుక్‌లో రీల్స్‌ అనేవి తక్కువ డ్యూరేషన్ తో మాత్రమే ఉండేవి. ఇకపై లాంగ్‌ లెన్త్‌ వీడియోలు సైతం అప్‌లోడ్‌ చేయొచ్చు. దాంతోపాటు సేఫ్టీ సెట్టింగ్స్‌, పబ్లిషింగ్‌ కంట్రోల్స్‌ విషయంలోనూ మార్పులుంటాయని తెలిపింది. ఫీడ్‌, రీల్స్‌.. రెండింటికీ ఆడియన్స్‌ సెట్టింగ్స్‌ ఒకేలా ఉంటాయని.. యూజర్లు ఎంచుకున్న ప్రైవసీ సెట్టింగ్స్‌ అన్ని వీడియో కంటెంట్‌కు వర్తిస్తాయని మెటా చెబుతోంది. Facebook Videos On Reels Format.

ఈ కొత్త సిస్టమ్‌ అప్లికేబుల్ అయిన తర్వాత యూజర్లు తమ ప్రైవసీ సెట్టింగ్స్‌ను రివ్యూ చేసుకుంటే గనుక కావాల్సిన మార్పులు చేసుకోవాలనే నోటిఫికేషన్‌ వస్తుంది. దాంతో వీడియోలు చూపించాలనుకుంటున్న ఆడియన్స్‌కు మాత్రమే చేరుతాయి. అంటే అది ఫ్రెండ్స్‌ అయినా.. ఏదైనా గ్రూప్‌ అయినా.. జనరల్‌ ఆడియన్స్‌ అయినా సరే చూజ్ చేసుకున్న వారికే వెళ్తాయి.

Also Read: https://www.mega9tv.com/technology/smart-dental-floss-that-tells-you-how-much-pressure-you-have/