
పోయిన నెంబర్లను తిరిగి పొందాలంటే.. ఏం చేయాలంటే.. ఆండ్రాయిడ్ ఫోన్ అయితే గనుక ముందుగా సెట్టింగ్స్‌కు వెళ్లాలి. అందులో గూగుల్ ఆప్షన్ ఎంచుకుని గూగుల్ అకౌంట్ మేనేజ్మెంట్పై ట్యాప్ చేయాలి. తర్వాత పీపుల్ అండ్ షేరింగ్ ఆప్షన్ ఓపెన్ చేసి, కాంటాక్ట్స్‌కి వెళ్లాలి.
తర్వాత ఏదైనా బ్రౌజర్లో contacts.google.com ఓపెన్ చేసి గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అవ్వాలి. గూగుల్‌తో అప్డేట్ చేసిన పాత నెంబర్లన్నీ అక్కడ కనిపిస్తాయి. అవి డిలీట్ అయి ఉంటే మెనూకి వెళ్లి undo changes అనే ఆప్షన్ ను సెలక్ట్ చేయాలి. అవసరమైతే కస్టమ్ డేట్ ను సెట్ చేసి మరీ కాంటాక్ట్‌లను తిరిగి పొందొచ్చు. ఐఫోన్లో అయితే ముందుగా icloudతో అప్డేట్ చేయాలి.
ఐఫోన్ యూజర్లు అయితే తమ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆపిల్ ఐడీపై ట్యాప్ చేయాలి. అందులో ఐక్లౌడ్‌కి వెళ్లి కాంటాక్ట్స్ స్విచ్ని ఆన్ చేయాలి. అప్పటికే ఆన్ చేసి ఉంటే నెంబర్లు ఫోన్లో ఆటోమేటిక్‌గా కనిపిస్తాయి. ల్యాప్ ట్యాప్ లేదా బ్రౌజర్లో icloud.com ఓపెన్ చేసి ఆపిల్ ఐడీతో లాగిన్ చేయాలి. తర్వాత అకౌంట్ సెట్టింగ్స్‌కు వెళ్లి ఆపై కాంటాక్ట్‌ను రీస్టోర్ ఆప్షన్ ఎంచుకుంటే చాలు.. కాంటాక్ట్స్ అన్ని వచ్చేస్తాయి.
ట్రూకాలర్ యాప్ వాడే యూజర్లకు కాంటాక్ట్ బ్యాకప్ చాలా ఈజీ. ఎందుకంటే నెంబర్లు అందులో కూడా సేవ్ అయి ఉంటాయి. ట్రూకాలర్ ను ముందుగా లాగిన్ చేసి బ్యాకప్ ఆప్షన్ ఆన్‌లో ఉంటే వెంటనే కాంటాక్ట్ లిస్ట్ రీస్టోర్ చేసుకోవచ్చు. అలాగే మెసేజ్ యాప్‌లో కూడా ఎప్పుడైనా ఎస్ఎంఎస్లు వాడి ఉంటే అక్కడ కూడా కాంటాక్ట్స్ ను చూడొచ్చు.