
Beware of Spy apps: మన ఫోన్‌లో స్పై యాప్‌లు ఉన్నాయా లేదా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈరోజుల్లో రిలేషన్ ఏదైనా.. డబ్బు విషయంలో అభిప్రాయ బేధాలు ఏర్పడినప్పుడు, పర్సనల్ డీటాచ్మెంట్ కలిగినప్పుడు, మనం ఎంతగానో నమ్మినవారే మనకు పరాయివాళ్ళు, శత్రువులు అవుతారు. అలాంటప్పుడు మనకు హాని చేసేందుకు.. మన పర్సనల్ డేటాను చోరీ చేసేందుకు.. మన ఫోన్ లో మనకు తెలియకుండా కొన్ని స్పై యాప్స్ ను ఇన్స్టాల్ చేయవచ్చు. అసలు ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ లలో స్పై యాప్‌లను ఎలా గుర్తించాలి? వాటిని ఎలా తొలగించాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం:
మీ ఫోన్‌లో స్పై యాప్‌లు ఉన్నట్లయితే..
ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుంది.
మొబైల్ డేటా ఉపయోగించినా, ఉపయోగించకపోయానా త్వరగా అయిపోతుంది.
ఫోన్ హీట్ ఎక్కుతుంది.
Android ఫోన్‌లో స్పై యాప్‌లను ఎలా గుర్తించి తొలగించాలంటే..
సెట్టింగ్స్ లోకి వెళ్లి యాప్స్ పై క్లిక్ చేయాలి. అందులో ఆల్ యాప్స్ లేదా మేనేజ్ యాప్స్ లోకి వెళ్లి, డివైస్ హెల్త్, సిస్టమ్ అప్‌డేట్ లేదా సర్వీస్ లాంటి అనుమానాస్పద పేర్లతో ఏవైనా యాప్‌లు ఉంటే చెక్ చేయాలి.
షో సిస్టమ్ యాప్స్ పై క్లిక్ చేసి అందులోని సిస్టమ్ యాప్‌లను కూడా పరిశీలించాలి.
అనుమానం వస్తే వాటిని డిజేబుల్ లేదా అన్‌ఇన్‌స్టాల్ చేసేయండి. Beware of Spy apps
ఐఫోన్‌లో అయితే..
సెట్టింగ్స్ లోకి వెళ్లి జనరల్ పై క్లిక్ చేయండి. అందులో ఐఫోన్ స్టోరేజ్ లోకి వెళ్లి, గుర్తు లేని లేదా మీరు ఇన్‌స్టాల్ చేయని యాప్‌లు ఉన్నాయా, లేదా చూసుకోండి.
అలాగే VPN (వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్) & డివైస్ మేనేజ్మెంట్ సెక్షన్‌ను చెక్ చేయాలి.
అనుమానాస్పదంగా అనిపించిన యాప్‌లను వెంటనే డిలీట్ చేసేయండి.
అలాగే, వైర్ షార్క్ లాంటి నెట్‌వర్క్ మానిటరింగ్ టూల్స్ వాడి, ఏయే యాప్‌లు ఏ సర్వర్‌కి కనెక్ట్ అవుతున్నాయో కూడా చెక్ చేయండి.
మీ Wi-Fi రూటర్ లాగ్స్ చెక్ చేసి, మీ ఫోన్ నుంచి బయటకు వెళుతున్న అనుమానాస్పద కనెక్షన్‌లను గుర్తించండి.
గోప్యత అంటే కేవలం వ్యక్తిగత విషయం మాత్రమే కాదు. ఇది మీ భద్రత, స్వేచ్ఛకి సంబంధించిన హక్కు. కాబట్టి ఎవరూ మీపై నిఘా పెట్టకుండా ఉండాలంటే మీరు స్మార్ట్‌గా ఉండాలి. మీ ఫోన్‌ను తరచూ చెక్ చేసుకొని, అన్వాంటెడ్ యాప్స్, వెబ్సైట్ లకు అనుమతి ఇవ్వకుండా జాగ్రత్త పడండి.
Also Read: https://www.mega9tv.com/technology/what-are-the-specialities-in-google-ai-mode/