గూగుల్ సేఫ్టీ చార్టర్ ద్వారా ఆన్లైన్ మోసాలకు చెక్!

ఈరోజుల్లో ఆన్‌లైన్‌ మోసాలు భారీగా పెరిగాయి.
Check online fraud through Google Safety Charter: ఇక్కడ చూసినా రోజూ వేలాదిమంది ఫిషింగ్‌ వెబ్‌సైట్స్‌, ఫేక్‌ యాప్స్‌, స్కామ్‌ కాల్స్‌కు, మెసేజ్ లకు, లింక్ ఓపెన్ చేస్తే చాలు అనే వాటికి రెస్పాండ్ అయి, డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈ క్రమంలో గూగుల్‌ భారత యూజర్ల కోసం టెక్‌ కంపెనీ ‘గూగుల్‌ సేఫ్టీ చార్టర్‌’ అనే కొత్త సైబర్‌ సెక్యూరిటీ గైడ్‌లైన్స్‌ ను తీసుకువచ్చింది. ఇంటర్‌నెట్‌ను సేఫ్ గా ఉంచడం, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌పై నమ్మకాన్ని కొనసాగించడమే లక్ష్యంగా ఇది పని చేయనుంది.

వాస్తవానికి ఇదొక డిజిటల్ భద్రతా పాలసీ. ముఖ్యంగా భారతీయ యూజర్ల గోప్యత, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇంటర్నెట్‌ను మరింత సురక్షితంగా మార్చడం, స్కామ్‌లను నుంచి ప్రజలను రక్షించడం, బాధ్యతాయుతమైన డిజిటల్‌ ఎన్విరాన్‌మెంట్‌ను సృష్టించడం దీని ప్రధాన ఉద్దేశం.

ఈ చార్టర్‌ కింద యూజర్‌ డేటా అనేది భద్రతా, పారదర్శకత, స్పష్టమైన అనుమతి విధానాన్ని అనుసరించే యాప్‌లకు మాత్రమే ఇక ప్రాధాన్యత ఇస్తుంది. దాంతోపాటు గూగుల్‌ ప్లే స్టోర్‌లో నకిలీ, ఆర్థిక మోసాలకు పాల్పడే యాప్స్‌ను సకాలంలో గుర్తించి వాటిని బ్లాక్ చేసే కొత్త సిస్టమ్ ను గూగుల్‌ అమలు చేయనుంది. సేఫ్ బ్రౌజింగ్‌ కోసం యూజర్లకు ఎప్పటికప్పుడు హెచ్చరికలతో పాటు సూచనలు, సెక్యూరిటీ వార్నింగ్‌ లను కూడా పంపుతుంది. Check online fraud through Google Safety Charter!

  • డిజిటల్‌ చెల్లింపులు పెరిగిన నేపథ్యంలో ఆన్‌లైన్‌ సేవల అవసరం పెరిగిన క్రమంలో సైబర్‌ మోసాలు సైతం ప్రమాదకరస్థాయికి పెరిగాయి.
  • కేవైసీ పేరుతో ఫేక్‌కాల్స్‌, లింక్‌లపై క్లిక్‌ చేస్తే డబ్బును సైబర్‌ నేరగాళ్లు లూటీ చేస్తున్నారు. వాట్సప్‌, ఎస్‌ఎంఎస్‌లు పంపుతూ మోసాలకు పాల్పడుతున్న ఘటనలు తరచూ చూస్తున్నాం, వింటున్నాం.
  • ఈ క్రమంలో ఫోన్ పే, గూగుల్‌ పే, పేటీఎం, బజాజ్‌ ఫైనాన్స్‌ సర్వీస్‌ తదితర ప్రముఖ యాప్స్‌ అన్నీ ఈ చార్టర్‌లో భాగం చేయనుంది.
  • సేఫ్టీ చార్టర్‌ను అనుసరించే ప్లే స్టోర్‌లోని యాప్‌లకు గూగుల్‌ త్వరలోనే ‘సేఫ్టీ వెరిఫైడ్‌’ ట్యాగ్‌ ఇవ్వనుంది.
  • దీనివల్ల ఏదైనా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే ముందు రేటింగ్‌, డౌన్‌లోడ్‌ నెంబర్‌, పర్మిషన్స్‌ను తప్పనిసరిగా వెరిఫై చేసుకోవాలని యూజర్లకు సజెషన్ ఇస్తుంది.
  • ఈ గూగుల్‌ చొరవతో యూజర్ల భద్రతా ప్రమాణాలు మరింత పెరగనున్నాయి. గూగుల్‌ వెరిఫైడ్‌ ట్యాగ్‌ కారణంగా మోసపూరిత, ఫేక్‌ యాప్స్‌ను గుర్తించడం ఈజీ అవుతుంది. దాంతో యూజర్లు సైబర్‌ నేరాల బారినపడే ప్రమాదం తగ్గుతుంది.

Also Read: https://www.mega9tv.com/technology/make-instagram-live-private-by-using-these-settings/