
మొబైల్ ఫోన్ కావచ్చు.. డెస్క్ టాప్ కావచ్చు. ఇంటర్ నెట్ బ్రౌజ్ చేసే చాలామంది గూగుల్ క్రోమ్‌ను వాడుతున్నారు. ఇప్పుడా గూగుల్ క్రోమ్ వాడే వారి కంప్యూటర్ లను, పీసీలను సైబర్ నేరగాళ్లు చాలా సులభంగా యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. తాజాగా క్రోమ్ బ్రౌజర్ వాడే వారికి ప్రభుత్వం కొన్ని హెచ్చరికలు జారీ చేసింది.
మన ఇండియాలోనూ ప్రజలు పెద్ద ఎత్తున క్రోమ్ వాడుతున్నారు. అంటే ఇలా వాడేవారు కొన్ని కోట్లల్లో ఉంటారు. అది కూడా డెస్క్ టాప్‌లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడే వారికి హైరిస్క్ ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. డెస్క్ టాప్‌లో గూగుల్ క్రోమ్ వాడే వారికి భద్రత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ది ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT In) తెలిపింది.
గూగుల్ క్రోమ్ ఆర్బిటరీ కోడ్‌లో ఏర్పడిన లోపం కారణంగా సులభంగా సైబర్ అటాక్‌కు గురయ్యే అవకాశం ఉందని చెబుతుంది. గూగుల్ క్రోమ్ వాడేవారి కంప్యూటర్లను సైబర్ నేరగాళ్లు ఈజీగా యాక్సెస్ చేసుకునే అవకాశం ఉండటంతో ఈ సమస్యను హైరిస్క్ సమస్యగా ప్రకటించింది. ఇక సాధారణ ప్రజలు ఈ సమస్య నుంచి బయటపడాలంటే వీలైనంత త్వరగా క్రోమ్ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు గూగుల్ క్రోమ్ పాత వెర్షన్ లలో ఈ సమస్య తలెత్తుతోంది.
136.0.7103.113 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్ గూగుల్ క్రోమ్ వాడే వారికి ఎలాంటి సమస్య లేదు. డెస్క్ టాప్‌లో క్రోమ్ వాడుతున్నవారు అప్‌డేట్ కోసం .. గూగుల్ క్రోమ్ ఒపెన్ చేసిన తర్వాత మూడు చుక్కలపై క్లిక్ చేయాలి. అక్కడ సెట్టింగ్ ఆప్షన్ క్లిక్ చేసి.. ఎబౌట్ క్రోమ్‌లోకి వెళ్లి.. అక్కడ అప్‌డేట్ మీద క్లిక్ చేస్తే చాలు.. క్రోమ్ అప్‌డేట్ అయిపోతుంది. మీరు ఈ సైబర్ క్రైమ్ హై రిస్క్ నుంచి సేఫ్ అవుతారు.