ట్రూ కాలర్ మెసేజ్ ఐడీ వల్ల డేటా మరింత సురక్షితం!

ట్రూకాలర్ సంస్థ ఇప్పుడు మరింత అడ్వాన్స్ అయి.. ఏఐ ఆధారిత కొత్త ఫిల్టర్ ను తీసుకొచ్చింది. ఇది ఇండియాతో పాటు మరో 30 దేశాల్లో అప్లికబుల్ అవుతుంది. ఇక ఈ మెసేజ్ ఐడీస్ అనేది ఇన్ బాక్స్ ను స్కాన్ చేసి, ముఖ్యమైన మెసేజ్లను అవలీలగా గుర్తిస్తుంది. ఇంగ్లిష్ తో పాటు హిందీ, స్పానిష్ తదితర భాషల్లో ఉన్న మెసేజ్లనూ చదువుతుంది. బ్యాంకు మెసేజెస్, అలర్ట్స్ నుంచి డెలివరీ ఓటీపీ అప్డేట్లు, విమాన ప్రయాణాలు, పేమెంట్ రిమైండర్స్ వరకూ ఇలా అన్నింటినీ ఇది గుర్తిస్తుంది. ఇందుకు సంబంధించిన ముఖ్యమైన వివరాల అనాలసిస్ ను, ముఖ్యమైన అంశాలను చూపిస్తుంది. తద్వారా త్వరగా తక్షణం స్పందించేలా చేస్తుంది.

స్పామ్ మెసేజ్ లు, అన్ నౌన్ నెంబర్ల నుంచి వచ్చే మెసేజ్ లు వెల్లువెత్తుతూ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్న ఈ ప్రస్తుత తరుణంలో మెసేజ్ ఐడీస్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇది చేసే స్కానింగ్ అనేది పర్టిక్యులర్ గాడ్జెట్ కే పరిమితమవుతుంది. కాబట్టి పర్సనల్ డేటా పోయేందుకు, ఉల్లంఘనకు అవకాశముండదు. సేఫ్ గా ఉంటుంది. రీడ్ ఎస్ఎంఎస్, డిస్ప్లే ఓవర్ అదర్ యాప్స్ ఆప్షన్లను ఎంచుకోవడం వల్ల ముఖ్యమైన టెక్స్ట్ మెసేజ్ ల అలర్ట్స్ అనేవి వస్తాయి.
మరింత సెక్యూరిటీ కోసం గ్రీన్ మెసేజ్ ఐడీస్ అనే మరో సదుపాయాన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల వ్యాపార సంస్థల విశ్వసనీయతను టిక్ మార్క్ తో ధ్రువీకరిస్తూ, సర్వీసెస్ లో లోపం లేకుండా నియంత్రిస్తుంది.