
వాట్సాప్ యూజ్ చేసేవారికి తెలియని నంబర్ నుంచి ఒక ఇమేజ్ వస్తుంది. అవి మీమ్స్, గ్రీటింగ్స్ లేదా ఎవరో ఫార్వార్డ్ చేసిన కొటేషన్ వంటివి అయి ఉండొచ్చు. కానీ ఆ ఫొటోలో కనపడని మాల్వేర్ కోడ్ ఒకటి ఉంటుంది. ఫోటో డౌన్‌లోడ్ అయిన వెంటనే మాల్వేర్ బాక్గ్రౌండ్ లో ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఇది హ్యాకర్లకు మీ మొబైల్ ను యాక్సెస్ చేసేందుకు వీలు కల్పిస్తుంది.
ఒకసారి ఫోన్ హ్యాక్ అయితే ఇక ఆ మాల్వేర్ మీ కీ స్ట్రోక్‌లను ట్రాక్ చేస్తుంది. ఇది మొదలు బ్యాంకింగ్ యాప్‌లను ఆటోమేటిక్ గా యాక్సెస్ చేసేసి, పాస్‌వర్డ్‌లను దొంగలిస్తుంది. మీ గుర్తింపును కూడా క్లోన్ చేసేస్తుంది. ఈ తరహా కొత్త స్కామ్‌ల ద్వారా సైబర్ నేరగాళ్లు చాలా ఈజీగా ఫోన్ ట్రాక్ చేసి బ్యాంకు ఖాతా నుంచి డబ్బును కొట్టేస్తున్నారు.
ఈ మోసాలు ఎక్కువగా పండుగ సీజన్లు, సేల్స్ అప్పుడు, వార్తలు చూసేటప్పుడు జరుగుతాయి. ఎందుకంటే ఆ సమయంలో అవగాహన కోసం ప్రజలు తెలియని మెసేజ్ లను ఎక్కువగా ఓపెన్ చేస్తారు.
ఎలా అధిగమించాలి..
- తెలియని వ్యక్తుల నుంచి ఫోటోలు లేదా ఫైళ్ళను ఎప్పుడు కూడా డౌన్‌లోడ్ చేయవద్దు.
- వాట్సాప్ సెట్టింగ్‌లలో మీడియా ఆటో-డౌన్‌లోడ్‌ను ఆపేయండి. ఎందుకంటే ఈ ఫీచర్ వల్ల మీకు తెలియకుండానే వాటంతట అవే ఇమేజెస్ డౌన్లోడ్ అయిపోతాయి. కాబట్టి ఆఫ్ లో ఉంచండి.
- మీ ఫోన్ యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను రెగ్యులర్ గా అప్‌డేట్ చేయండి.
- అనుమానాస్పద సందేశాలు ఏవైనా వస్తే WhatsAppకు రిపోర్ట్ చేయండి. పంపిన వారిని వెంటనే బ్లాక్ చేయండి.
- అధునాతన టెక్నాలజీని ఉపయోగించుకొని సైబర్ నేరగాళ్లు ఎలా మోసాలకు తెగబడుతున్నారో చెబుతోంది. కాబట్టి, WhatsApp వినియోగదారులు అలెర్ట్ గా ఉండాలి. తెలియని లింక్‌లు లేదా మీడియాపై క్లిక్ చేయడం మానేయాలి.