పాన్ కార్డు డౌన్లోడ్ అంటూ.. ఈ.మెయిల్ మీకొచ్చిందా?

PIB New Facts Alert: తాజాగా ఇ-పాన్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలంటూ మీకు ఏదైనా మెయిల్ వచ్చిందా? అయితే జాగ్రత్త!! ఈ టైప్ ఆఫ్ మెయిల్స్ సైబర్ మోసగాళ్లు మిమ్మల్ని తప్పుదోవ పట్టించి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసే కొత్త ఎత్తు అని అర్థం చేసుకోండి.

ఇది కంప్లీట్ గా ఫేక్ మెయిల్ అని క్లారిటీ ఇచ్చింది కేంద్రం.. ఇలాంటి మెయిల్స్ పట్ల ప్రజలు అలెర్ట్ గా ఉండాలని విజ్ఞప్తి చేసింది. ఈ తరహా ఆర్ధిక, సున్నితమైన సమాచారానికి సంబంధించి వచ్చే ఈ-మెయిల్స్, లింక్స్, కాల్స్, ఎస్ఎంఎస్ లకు రెస్పాన్స్డ్ కావొద్దు అంటూ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ డిపార్ట్మెంట్ ఎక్స్ లో తెలిపింది. PIB New Facts Alert.

రిమెంబర్ థిస్..

  • ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎప్పుడూ ఈ.మెయిల్ ద్వారా మీ పర్సనల్ ఇన్ఫో ను అడగదు.
  • మీ పిన్ నంబర్, పాస్వర్డ్, క్రెడిట్ కార్డ్, బ్యాంక్ లేదా ఇతర ఫైనాన్సియల్ డీటైల్స్ కావాలంటూ వాటిని యాక్సిస్ చేసే సమాచారాన్ని కోరుతూ ఐటీశాఖ ఇ-మెయిల్ పంపదని గుర్తుంచుకోండి.
  • అలానే ఐటీ డిపార్ట్మెంట్ కి చెందిన అధికారినని చెప్పుకొనే వ్యక్తుల నుంచి ఆదాయపు పన్నుశాఖ వెబ్సైట్ కు మిమ్మల్ని మళ్లించేలా ఏదైనా మెయిల్ వస్తే కూడా దానికి రెస్పాండ్ అవ్వొద్దూ.
  • అలాంటి మెయిల్ ద్వారా వచ్చే అటాచ్మెంట్ లను అసలు ఓపెన్ చేయొద్దు. ఎందుకంటే వాటిలో మీ కంప్యూటర్/ డివైస్ కి హాని కలిగించే సీక్రెట్ కోడ్ ఏదైనా ఉండొచ్చు. అది మీ డివైస్ ను హ్యాక్ కి గురి చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని మరవద్దు.
  • మీరు అనుమానాస్పద ఇ-మెయిల్/ ఫిషింగ్ వెబ్సైట్ లోని లింక్ లపై క్లిక్ చేస్తే, బ్యాంక్ ఖాతాతో పాటు క్రెడిట్ కార్డు డీటైల్స్ ను ఎట్టి పరిస్థితిలోనూ ఎంటర్ చేయకండి.
  • మీకు వచ్చే మెసేజ్ లో లింక్ ను బ్రౌజర్ ను కట్ చేసి పేస్ట్ చేయొద్దు. మీ కంప్యూటర్లలో యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ వాడటం ఉత్తమం.
  • ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకొనేలా జాగ్రత్త వహించండి.
  • మీకు ఏదైనా ఈ తరహాలో ఇమెయిల్ వచ్చినా లేదా ఐటీ శాఖ వెబ్సైట్ గా చెప్పుకొనే ఏ విషయమైనా మీకు అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే వాటిని webmanager@incometax.gov.in, incident@cert-in.org.in లకు కంప్లయింట్ రైజ్ చేయవచ్చు.

Also Read: https://www.mega9tv.com/technology/for-safe-data-2-steps-verification-and-strong-passwords-are-mandatory/