చాట్‌జీపీటీతో అన్ని చెప్పొద్దూ..?!

ఇటీవలి కాలంలో చాట్‌జీపీటీ చాలా ఆదరణ పొందింది. మామూలు ఏఐ అసిస్టెంట్‌ స్థాయి నుంచి డిజటల్‌ స్థాయిలో తల్లో నాలుకలా తోడుగా ఉంటోంది. మొదట్లో అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వటానికి మాత్రమే దీనిని డిజైన్‌ చేసినప్పటికీ ఇదిప్పుడు వెన్నటి ఉంటూ, మాట్లాడుకునే ఫ్రెండ్ గా మారింది. మనుషుల్లానే.. మాటామంతీకి వీలు కల్పిస్తోంది. స్టూడెంట్స్, ఉద్యోగులు, వృత్తి నిపుణులు ఎంతోమంది దీన్ని ఇప్పుడు వాడుకుంటున్నారు. ఎంత ఉపయోగకరమైనదైనా చాట్‌జీపీటీతో కొన్ని విషయాలు పంచుకోకపోవటమే మంచిదంటున్నారు టెక్ నిపుణులు. దీన్ని కేర్ ఫుల్ గా వాడుకోవాలే తప్ప అన్నిటి సమాచారం అందిస్తే మున్ముందు సేఫ్టీకి భంగం వాటిల్లే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

మన ఫుల్ నేమ్, అడ్రస్, కాంటాక్ట్ డీటైల్స్, బ్యాంక్ డీటైల్స్, పాస్‌వర్డ్.. ఇలాంటివి చాట్‌జీపీటీతో షేర్‌ చేసుకోవద్దు. ఏఐ మోడళ్లు డేటాను స్టోర్‌ చేసుకోకపోయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. వ్యక్తిగత, రహస్య విషయాలను ఆన్‌లైన్‌లో డిస్కస్ చేసేముందు అలర్ట్ గా ఉండాలి. చాట్‌బాట్‌ను ఫైనాన్షియల్ అడ్వైజర్ గా ఉపయోగించుకునేటప్పుడు చెప్పే విషయాల పట్ల జాగ్రత్త వహించాలి.

సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా ఉంచాల్సిన కొన్ని ముఖ్యమైన ఆఫీసు డాక్యుమెంట్లు, బిజినెస్ స్ట్రాటజీస్, ప్లాన్స్.. వేటిని చాట్‌జీపీటీలో పంచుకోవద్దు. సైబర్‌ సెక్యూరిటీ ముప్పు పొంచి ఉండొచ్చు.

వివిధ విషయాల గురించి తెలుసుకునేందుకు చాట్‌జీపీటీ ఉపయోగపడే మాట నిజమే అయినా అదిచ్చే సలహాలు వైద్య, న్యాయ నిపుణులకు పూర్తిగా ప్రత్యామ్నాయం కావు. ఏఐ సృష్టించిన సమాచారం మీద అతిగా ఆధారపడొద్దు. అవసరమైనప్పుడు డాక్టర్‌ లేదా న్యాయవాదిని నేరుగా సంప్రదించి కచ్చితమైన సలహాలను తీసుకోవాలి.

ఏఐ మోడళ్లు నైతిక ప్రమాణాలను అనుసరిస్తాయి. అందువల్ల హానికర, అక్రమ, అనుచిత చర్చలను ఆమోదించవు. ఇలాంటి అంశాలను చర్చిస్తే యాక్సెస్‌ పరిధి అనేది తగ్గుతుంది. క్లారిటీ లేని జవాబులు అందివొచ్చు.

భవిష్యత్తులో చేసే పెట్టుబడి, రిటర్న్స్ వ్యూహాల కోసం ఏఐ మీద ఆధారపడితే పొరపాట్లకు, తప్పుడు నిర్ణయాలకు దారి తీయొచ్చు.
తమ ఆలోచనలను, జరిగిన సంఘటనలను పంచుకునేందుకు సాయపడినా.. అది కేవలం ఏఐ మోడలే గానీ మన ఫ్రెండ్లీ అడ్వైజర్ కాదనే విషయం గ్రహించాలి.