పేటీఎం ‘హైడ్ పేమెంట్’ గురుంచి మీకు తెలుసా..?!

పేటీఎం కొత్త గోప్యత ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ఇది యూజర్స్ తమ ట్రాన్సాక్షన్స్ లిస్ట్ నుంచి కొన్ని లావాదేవీలను కనపడకుండా సీక్రెట్ గా ఉంచడంలో సాయపడుతుంది. తిరిగి మళ్లీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవటానికి వీలు కల్పిస్తుంది. దీనిపేరే.. హైడ్ పేమెంట్. ఇతరుల కంట పడొద్దని భావించే లావాదేవీలను దీని సాయంతో దాచుకోవచ్చన్నమాట.

  • ఈ ఫీచర్ ను ఎలా ఉపయోగించుకోవాలంటే..

ముందుగా పేటీఎం యాప్ ఓపెన్ చేసి, ‘బ్యాలెన్స్ అండ్ హిస్టరీ’ కి వెళ్లాలి. ఏదేని దాచాలనుకున్న చెల్లింపును ఎడమవైపునకు స్వైప్ చేయాలి. హైడ్ అనే ఆప్షన్ కనిపించగానే దాని మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మేషన్ ప్రాంప్ట్ మీద ‘ఎస్’ను సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఆ ట్రాన్సాక్షన్ మాయమవుతుంది.

తిరిగి చూసుకోవాలంటే మటుకు.. పేటీఎం యాప్ తెరచి ‘బ్యాలెన్స్ అండ్ హిస్టరీ’లోకి వెళ్లి.. పేమెంట్ హిస్టరీ పక్కనుండే మూడు చుక్కల ఐకాన్ గుర్తును నొక్కాలి. మెనూ నుంచి ‘వ్యూ హిడెన్ పేమెంట్స్’ను ఎంచుకోవాలి. ఫోన్ కు పెట్టుకున్న పిన్ లేదా బయోమెట్రిక్ తో కన్ఫర్మ్ చేసుకోవాలి. తిరిగి కనిపించాలనుకునే లావాదేవీ మీద ఎడమవైపునకు స్వైప్ చేసి.. ‘అన్ హైడ్’ మీద క్లిక్ ఇవ్వాలి. అప్పుడు ఆ లావాదేవీ తిరిగి పేమెంట్ హిస్టరీలో కనిపిస్తుంది అంతే!