
Emails with AI support: కామన్ మేన్ నుంచి కార్పొరేట్ సంస్థల వరకు మెయిల్ సర్వీసులను ఇప్పటివరకు అఫిషియల్ లెటర్స్ గానో, ఉత్తర ప్రత్యుత్తరాల లేఖనిగానో ఉపయోగించడం పరిపాటైంది. అటువంటి ఇ-మెయిల్స్ ఇప్పుడు ‘ఏఐ’ సపోర్ట్‌తో ఇంకొంచం అడ్వాన్స్డ్ గా మారిపోతే ఎలా ఉంటుంది. మనకు ఇప్పటివరకు ఇలా ఎన్ని రకాల ఇన్‌స్టాంట్ మెసేజ్ సర్వీసేస్ వచ్చినా.. ఇ-మెయిల్స్‌కు ఉన్న ప్రియారిటీ మాత్రం అసలు తగ్గలేదు.
గూగుల్ సంస్థకు చెందిన డీప్‌మైండ్ సీఈవో డెమిస్ హస్సాబిస్ ఇటీవల జీ.మెయిల్ కోసం ఒక కొత్త ఏఐ టూల్‌ను డెవలప్ చేయనున్నట్లు తెలిపింది. ఇది నెక్స్ట్ జనరేషన్ ఇ-మెయిల్ సిస్టమ్ గా అవతరించనుందని తెలిపారు. డీప్‌మైండ్ ఆధారిత ఈ నయా ఏఐ టూల్ కాస్త రోజువారీ ఇ-మెయిల్స్‌ను రీడ్ చేయడం నుంచి అర్థం చేసుకోవడం, మెయిల్ రైటింగ్ స్టైల్ ను అనుకరించడం, మన తరఫున మెయిల్స్‌కు ఆటోమేటిక్‌గా రిప్లై ఇవ్వడం లాంటి పనులన్నింటినీ చేస్తుందీ. దీని పేరే షార్ట్ ఫార్మ్ లో ఏజీఐ. దీనిని హ్యూమన్ లెవల్ రీజనింగ్ కలిగిన ఏఐ సిస్టమ్‌గా పిలుస్తారు. మరో ఐదు నుంచి పదేళ్లలో ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ ఏఐ ఫీచర్స్ కేవలం జీ.మెయిల్ వరకే పరిమితం కాలేదు. ఇతర మెయిల్ ప్రొవైడర్స్ కూడా ఏఐ ద్వారా వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టనుంది.
క్రోమ్ వాడుతున్నారంటే.. అందుకు అనుమతి పొందే జీ.మెయిల్ ను ఉపయోగిస్తున్నట్టే కదా! అయితే గూగుల్ అందించే జీ.మెయిల్, గూగుల్ డ్రైవ్‌కి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ను సేవ్ చేసుకునే పర్సనల్ డేటా డ్రైవ్ లా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే గూగుల్ జీ.మెయిల్ కోసం ‘ఏఐ’ డెవలప్‌మెంట్‌ని ఇంట్రడ్యూస్ చేయనుంది. Emails with AI support.
ఈ టూల్ మీ రైటింగ్ స్టైల్ ని అనుకరిస్తూ.. మీకు వచ్చిన మెయిల్‌కు కూడా రిప్లై ఇస్తుంది. ఏరోజుకారోజు కంటెంట్‌ని మానిటర్ చేస్తుంది. మొత్తం డేటాను అనలైజ్ చేసి, మీ రైటింగ్ స్టైల్ ని పట్టేస్తుంది. ఎప్పటికప్పుడు మీకు వచ్చే మెయిల్స్‌కు స్మార్ట్ రిప్లైస్ ను సజెస్ట్ చేస్తుంది. దీంతో మీ మెయిల్స్‌ను మేనేజ్ చేయడం మరింత ఈజీ అవుతుంది. ఇన్‌బాక్స్‌కి చేరే మెయిల్స్‌లో కంటెంట్ ఆధారంగా వాటి ప్రాధాన్యాన్ని సైతం బై డిఫాల్ట్ గా సెట్ చేస్తుంది. దీంతో యూజర్లు ఇంపార్టెంట్ మెయిల్స్‌కి వెంటనే రెస్పాండ్ అయ్యే వీలుంటుంది. ఈ క్రమంలో డేటా యూసేజ్ చాలావరకు తగ్గుతుంది. ఇక గూగుల్ ఇప్పటికే హెల్ప్ మీ రైట్ (Help me write), స్మార్ట్ కంపోజ్ (Smart Compose), స్మార్ట్ రిప్లై (Smart Reply).. వంటి ఏఐ సేవలను డెవలప్ చేసింది. ఇప్పుడు ఈ నెక్ట్స్ జనరేషన్ టూల్‌తో మరో అడుగు ముందుకు వేసిందని టెక్నాలజీ నిపుణులు అంటున్నారు.
అవుట్‌లుక్‌లో అడ్వాన్స్‌డ్ ఏఐ:
మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్ కూడాఏఐ రేస్‌లో వెనక్కి తగ్గడం లేదు. గత ఏడాదే Microsoft 365 Copilotను అవుట్‌లుక్‌లో ఇంటిగ్రేట్ చేసింది. అంతేకాదు.. రెగ్యులర్ అప్‌డేట్స్‌తో అవుట్‌లుక్ లుక్ మార్చేస్తున్నది. ముఖ్యంగా ఈ Copilot ఇ-మెయిల్స్‌ను అనలైజ్ చేస్తుంది. ‘ఏఐ రిైప్లె జనరేటర్’తో మీ రిైప్లెలు డ్రాఫ్ట్ చేయడమే కాకుండా, మీ షెడ్యూల్ ఆధారంగా మీటింగ్స్‌ని ఆటోమేటిక్‌గా బుక్ చేస్తుంది. ఉదాహరణకు, మీకు ఈ వారంలో ఒక గంట ఖాళీ స్లాట్ ఉందనుకోండి, ‘ఆ టైమ్‌లో మీటింగ్ సెట్ చేయాలా?’ అంటూ Copilot సజెస్ట్ చేస్తుంది. మీ అనుమతితో మీటింగ్స్ స్లాట్స్‌ని బ్లాక్ చేస్తుంది. అంతేకాదు.. ఇన్‌బాక్స్ క్లీనప్ ఫీచర్‌తో అనవసరమైన ఇ-మెయిల్స్‌ని డిలిట్ చేస్తుంది. ప్రాధాన్యం ఆధారంగా మెసేజ్‌లను సార్ట్ చేస్తుంది. Wordeep రాసిన మెయిల్స్‌ని రియల్ టైమ్‌లో చెక్ చేస్తుంది. ఏవైనా మిస్టేక్స్ ఉంటే అప్పటికప్పుడే మార్పు చేసి చూపిస్తుంది. కార్పొరేట్ ప్రొఫెషనల్స్‌కి టైమ్ మేనేజ్‌మెంట్‌లో ఈ ఏఐ ఫీచర్స్ బాగా హెల్ప్ అవుతాయి. ఇంకా చెప్పాలంటే.. ఇతర థర్డ్ పార్టీ ఏఐ సేవల్ని కూడా మెయిల్ సర్వీసుల్లో ఇంటిగ్రేట్ చేసుకునే వీలుంది.