
Google Launch Doppl App: చిన్న అకేషన్ అయినా.. పెద్ద వేడుక అయినా.. పండుగలు, పెళ్లిళ్లు ఇలా రకరకాల ఈవెంట్స్ కోసం మనం రెగ్యులర్ గా షాపింగ్ మాల్ కి వెళ్లి బట్టలు కొనుకుంటాం. అలానే టైం లేనప్పుడు.. కుదరనప్పుడు ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటాం.
అలాంటిది అలా చేసినప్పుడు.. ఆన్లైన్ లో ఏదైనా మంచి డ్రెస్ వేసుకోవడం చూసినప్పుడు మనకు ఎలా ఉంటుందనే సందేహం ఉంటుంది. ఒకటి దాన్ని బై చేయడం లేదా మళ్ళీ మాల్ కి వెళ్లి ట్రయిల్ వేయడం చేయాలి. ఇకపై ఆ అవసరం లేకుండా గూగుల్ ఓ కొత్త యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో మీరు కేవలం ఒక ఫొటోతో ఆ డ్రెస్ మీకెలా ఉందో సరి చూసుకోవచ్చు. దాని పేరే డోప్ (Doppl). Google Launch Doppl App. వర్చువల్ గా మీరెలా ఉంటారో చూసుకొనేందుకు ఈ యాప్ అవకాశం కల్పిస్తుంది. ముఖ్యంగా ఆన్లైన్ లో రెగ్యులర్ గా షాపింగ్ చేసేవారికి ఈ యాప్ బాగా యూస్ అవుతుంది.
ఈ యాప్ లో ముందు మీ పూర్తి ఫొటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆపై మీరు కోరుకుంటున్న దుస్తులు తాలుకా ఫొటో లేదా స్క్రీన్ షాట్ ను అప్లోడ్ చేస్తే చాలు.. ఏఐ సాయంతో మీరు వేసుకుంటే ఎలా ఉంటుందో రిఫరెన్స్ ప్రివ్యూ చూపిస్తుంది. అంతేకాదు దాన్నో షార్ట్ వీడియో గానూ రూపొందిస్తుంది. అంటే మీరు ట్రయల్ రూమ్ లో చూసుకున్నట్లుగానే చూసుకోవచ్చు. కావాలంటే ఈ ఫొటోలను, వీడియోలను మీరు సేవ్ అండ్ షేర్ చేసుకోవచ్చు. గూగుల్ ల్యాబ్స్ తీసుకొచ్చిన ఈ యాప్ ప్రస్తుతానికి ఎక్సపెరిమెంటల్ స్టేజ్ లో ఉంది.
గూగుల్ ప్లే స్టోర్,యాపిల్ యాప్ స్టోర్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇంకా భారత్ లో యూజర్లు దీన్ని వినియోగించాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇతర దేశాల్లో ఎప్పుడు తీసుకొచ్చేదీ గూగుల్ కూడా చెప్పలేదు. అంతేకాదు ప్రయోగ దశలో ఉన్న నేపథ్యంలో మీరు కేవలం షర్ట్/ టీషర్ట్ అప్లోడ్ చేసినా దానికి సూట్ అయ్యే మిగిలిన దుస్తులు, షూలను కూడా దానంతట అదే ఎంచుకొని యూజర్లకు చూపించడం దీని ప్రత్యేకత.