
జిబ్లీ స్టూడియో మొన్నామధ్య కాలంలో విపరీతంగా ట్రెండ్ అండ్ వైరల్ అయ్యింది. దాని తర్వాత వచ్చిన డిజిటల్ ఆర్ట్ ట్రెండ్లో బార్బీకోర్ హవా మాములుగా లేదు. బార్బీ, మార్వెల్ వంటి బొమ్మలలాగా కనిపించే ఈ ఇమేజెస్ సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
యాక్షన్, ఎంటర్టైన్మెంట్ తరహా రూపాల్లో తమను చూసుకొని నెటిజన్లు వీటిని చేయడంలో తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తమవే కాదు, ఇష్టమైన సెలబ్రిటీల ఫొటోలతోనూ బార్బికోర్ లను సృష్టిస్తున్నారు.
మీరు మీ పిల్లల కోసం బార్బీ బొమ్మలను చాలానే కొని ఉంటారు. బాక్సులో క్యూట్ గా కనిపిస్తూ.. వాటికి తగ్గట్టు ఆ పాత్రకు సరిపోయే వస్తువులు ఎంత అందంగా ఉంటాయో కదా! ప్రతి చిన్నారికి ఎంతో అపురూపమైన ఆ బొమ్మలని మనం ఎంతో ఇష్టంగా సెలెక్ట్ చేసి మరీ కొని ఇస్తాం.
మరీ అటువంటి బార్బీ బొమ్మలు చేతుల్లో ఉంటే.. ఇవి డిజిటల్ రూపంలో కనిపిస్తూ, కనువిందు చేస్తాయి. అసలు బార్బీకోర్ అంటే ఏంటంటే.. ఏఐ టూల్స్ ఉపయోగించి అచ్చం బార్బీ లాంటి రూపాన్ని సృష్టించుకోవడం అన్నమాట. ఒక్క బార్బీ రూపంలోనే కాదు, కెన్, మార్వెల్ సూపర్ హీరో.. ఇలా ఏ బొమ్మ రూపంలోనైనా ఇమేజ్ లను రూపొందించుకోవచ్చు.
ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అంటే..
ముందుగా చాట్ జీపీటి యాప్ లేదా వెబ్ బ్రౌజర్ ను ఓపెన్ చేయాలి. బొమ్మ బాక్సు రూపంలోకి మార్చుకోవాలనుకునే ఫొటోను సెలెక్ట్ చేసి, అప్లోడ్ చేయాలి. హై-రెజల్యూషన్, మంచి దుస్తులతో నిండుగా ఉన్న ఫొటో అయితే మంచిది. మసకగా, బ్లర్డ్ గా ఉండే ఫొటోస్ వద్దు.
- ఇక ఫొటోను అప్లోడ్ చేశాక డీటెయిల్డ్ గా ప్రాంప్ట్ టైప్ చేయాలి.
- ఎక్సాంపుల్ గా.. ఈ ఫొటోను నిజమైన బార్బీ యాక్షన్ బొమ్మగా మార్చమని రాయాలి. బాక్సులో ఏమేం ఉండాలో కూడా (కెమెరా, కళ్లద్దాలు, షూస్) వివరించాలి. వాళ్ళ మీద మీ పేరు, నిక్ నేమ్ వచ్చేలా వాటిని బోల్ట్ లో రాయాలి.
- దుస్తులు ఏ రంగులో ఉండాలో కూడా టైప్ చేయాలి. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా చాట్ జీపీటీ బొమ్మ బాక్సు తరహాలో ఒక ఇమేజ్ ను సృష్టిస్తుంది. ఒకవేళ అది నచ్చకపోతే మార్పులు చేర్పులు చేసుకోవచ్చు.
- వెనకాల ఉండే రంగు, బాక్సు డిజైన్, చుట్టూరా వస్తువుల వంటివి కూడా మార్చుకోవచ్చు.
- నచ్చినట్టుగా తయారైన బొమ్మ రూపాన్ని డౌన్లోడ్ చేసుకొని, షేర్ చేసుకుంటే చాలు.. మీరు కోరుకునే బార్బీ కోర్ రెడీ అయిపోయినట్టే!