
ఈరోజుల్లో సోషల్ మీడియాలో ఆక్టివ్ గా లేనిది ఎవరు చెప్పండి. ఇక ఇన్స్ స్టా గ్రామ్ లో నచ్చిన రీల్స్ ను చూస్తూ ఎంటర్టైన్ అవుతున్నాం. బాగా నచ్చిన ఫీడ్ లేదా ఇన్ఫర్మేటివ్ గా ఉన్న వాటిని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి గ్రూప్ చాట్ లో షేర్ చేసుకోవడం లేదంటే పర్సనల్ గా సేవ్ చేసుకోవడం చేస్తుంటాం. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇన్స్టాగ్రామ్ కొత్తగా బ్లెండ్ అనే ఫీచర్ ను తీసుకొచ్చింది. ఇందేంటో చూద్దాం రండి..
రీల్స్ తో కూడిన ప్రత్యేక ఫీడ్ ను జెనరేట్ చేసుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఆయా వ్యక్తుల కోసం ప్రత్యేక కంటెంట్ సూచనల ఆధారంగా రీల్స్ వచ్చేలా చేస్తుంది. ఈ ఫీచర్న్ ఏరోజుకారోజు న్యూ సజెషన్స్ తో రిఫ్రెష్ అవుతుంది. చాట్ విభాగంలో ఉండే దీని ద్వారా ఇతరులను కూడా ఆహ్వానించొచ్చు. అవతలివారు యాక్సెప్ట్ చేసిన తర్వాత బ్లెండ్ ను సృష్టించుకోవచ్చు. అంటే దీనికి ఇద్దరి అనుమతీ కావాలి.
ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అంటే..
ఇన్స్టాగ్రామ్ ను ఓపెన్ చేసి ముందుగా చాట్ లోకి వెళ్లాలి. విడిగా లేదా గ్రూప్ చాట్ అయినా సరే.. చాట్లో పైన కుడి మూలన కొత్త బ్లెండ్ ఫీచర్ అనేది కనిపిస్తుంది. దానిమీద తాకితే ఇన్వైట్ ఆప్షన్ కి సంబంధించి ప్రివ్యూ కనిపిస్తుంది.
అప్పుడు ఇన్వైట్ మీద క్లిక్ చేయాలి.
తర్వాత ఒకరు లేదా అంతకన్నా ఎక్కువమంది ఆ ఇన్వైట్ ను అగ్రీ చేస్తే తర్వాత ఒక మెసేజ్ ద్వారా బ్లెండ్ ను క్రియేట్ చేసుకోవచ్చు.