
మనం వర్క్ చేసే ప్లేస్ దగ్గరో, ఇంట్లోనో పీసీ వాడటం కామన్ అయ్యింది. అందులో రోజురోజుకీ డౌన్ లోడ్ చేసిన ఫైల్స్, డేటా అనేకం నిండి ఉంటుంది. అలాంటప్పుడు డెస్క్ టాప్ లో అనవసర ఫైళ్లు, స్క్రీన్ షాట్స్, ఇతర జంక్ స్టోరేజీ నిండిపోతే గనుక మీ పీసీ రిస్క్ లో ఉన్నట్లే.. వర్క్ కెపాసిటీ అనేది తగ్గుతుంది. అలా జరగకుండా ఉండాలంటే..
విండోస్ 11లో- సెటింగ్స్ ద్వారా సిస్టమ్ లోకి వెళ్తే స్టోరేజీ ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో షోమోర్ కేటగిరీస్ విభాగంలో లార్జ్ అండ్ అన్ యూజ్డ్ ఫైల్స్ అన్నీ కనిపిస్తాయి. అవసరం లేనివి చూసుకొని డిలీట్ చేసుకుంటే సరి.
విండోస్ 10లో- విండోస్ కీ, ఇ మీటలను కలిపి నొక్కితే ఫైల్ ఎక్సప్లోరర్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు పీసీలోకి వెళ్లి సెర్చ్ మెనూలో నక్షత్రం గుర్తు(*) టైప్ చేస్తే అన్ని ఫైళ్లు, ఫోల్డర్లు లిస్ట్ ఔట్ గా కనిపిస్తాయి. పైన సైజ్ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. జైగాంటిక్ (4జీబీ లేదా లార్డర్)తో ఆరంభించి అనవసరమైనవి తొలగించుకోవాలి.
ఇక మ్యాక్ లో – యాపిల్ మెనూ ద్వారా సిస్టమ్ సెటింగ్స్ లోకి వెళ్లాలి. జనరల్ విభాగంలో ఉండే స్టోరేజీ మీద క్లిక్ చేయాలి. కేటగిరీ మీద డబుల్ క్లిక్ చేస్తే స్పేస్ ను తీసుకుంటున్న పెద్ద పైళ్లు కనిపిస్తాయి. చూసుకొని క్లియర్ చేస్తే చాలు.