
AI Jobs in All Fields: ఏఐ కొత్త పుంతలు తొక్కుతున్న వేళ మాన్యుఫాక్చరింగ్, బిజినెస్ మేనేజ్మెంట్, హెల్త్, స్టడీ, కస్టమర్ సర్వీసెస్ తదితర కీలక రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తోంది. దీంతో.. భారత్ సైతం ఈ సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకోవాల్సిన అవసరాన్ని రీసెంట్ గా చేసిన సర్వే రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం:
- గూగుల్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ (ఏటీవీ)ల సహకారంతో ఎన్టీఎస్ అనే సంస్థ ‘ఏఐ ఫర్ ఆల్: బిల్డింగ్ ఆన్ ఏఐ రెడీ వర్క్ ఫోర్స్ ఇన్ ఆసియా- పసిఫిక్’ పేరిట ఒక రిపోర్టును రూపొందించింది. ఏఐ రంగంలో భారత్ కున్న అవకాశాలు, సవాళ్లను ఇందులో మెన్షన్ చేసింది.
- ఈ నివేదిక ప్రకారం.. 2030 నాటికి ఆసియా-పసిఫిక్ ప్రాంత జీడిపికి ఏఐ 3 ట్రిలియన్ డాలర్ల వరకు ఇన్కమ్ రాబట్టగలదట.
- ఏఐ ఆధారిత ఆటోమేషన్ లో ప్రోగ్రెస్ ను లెక్కలోకి తీసుకుంటే గనుక డేటాఎంట్రీ, షెడ్యూలింగ్, కస్టమర్ సర్వీస్ వంటి అన్ని అడ్మినిస్ట్రేటివ్ అండ్ సపోర్ట్ సెక్టార్స్ లోని ఉద్యోగాలకు ఇక ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది! ఇటువంటి ఉద్యోగాల్లో మహిళలు, అసంఘటిత కార్మికులు, డిజిటల్ లిటరసీలో వెనుకబడినవారే ఎక్కువగా ఉన్నారు.
- మాన్యుఫాక్చరింగ్, టెక్ట్స్ టైల్స్ అండ్ లాజిస్టిక్స్ వంటి రంగాల్లో పెద్ద మొత్తంలో అసంఘటిత కార్మికులు పని చేస్తున్నారు. ఈ రంగాలను ఏఐ, ఆటోమేషన్లు తీవ్రంగా ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఏటా స్కిల్స్ అందిపుచ్చుకోకపోతే మాత్రం వీరు జాబ్ మార్కెట్లో వెనుకబడిపోయే ప్రమాదం పెద్దమొత్తంలో ఉండనుంది.
- మన దేశ యువతలో చాలామంది ప్రస్తుతం తమ ఫస్ట్ జాబ్.. లేదంటే బెటర్ ఆప్షన్ కోసం నైపుణ్యాలను పెంచుకోవాలని చూస్తున్నారు.
- కానీ ఇక్కడ వీరు తీసుకునే నైపుణ్య శిక్షణకు, ఉద్యోగాలను ఇచ్చే సంస్థలు ఎక్సపెక్టేషన్ కి మధ్య సంబంధం లేనట్లు కనిపిస్తోంది. అభ్యర్థుల విషయంలో, కొన్నేళ్ల క్రితం ఉన్న స్కిల్స్ తో పోలిస్తే చాలా భిన్నమైన ప్రొఫైల్, స్కిల్స్.. నేడు సంస్థలు ఎక్స్ పెక్ట్ చేస్తున్నాయి. కేవలం డిగ్రీలే కాకుండా.. క్రిటికల్ థింకింగ్, అవసరానికి తగినట్లు తమను తాము మార్చుకోవడం, ఏఐ టూల్స్ ను సమర్థంగా ఉపయోగించడం వంటి నైపుణ్యాలను ప్రధానంగా చూస్తున్నారు.
- భారత్ లో ‘ఏఐ’ను అందిపుచ్చుకునే విషయంలో డిజిటల్ యాక్సెస్ కూడా మెయిన్ డ్రా బ్యాక్. కానీ చాలా రూరల్ ఏరియాస్ లోని ప్రజలకు ఇప్పటికీ స్మార్ట్ ఫోన్ అండ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది సరిగా లేదు. కాబట్టి రేపటి ఏఐ ఫ్యూచర్ జాబ్స్ కోసం ఈ డిజిటల్ అంతరాలను తగ్గించాలని నివేదిక సిఫార్సు చేసింది.
- దేశ శ్రామిక శక్తిలో దాదాపు 35 శాతం మహిళలే ఉన్నారు. ఆటోమేషన్ ముప్పు పొంచి ఉన్న ఆఫీస్ సపోర్ట్, రిటైల్ సేవల వంటి రంగాల్లో వీరి ప్రాతినిధ్యమే ఎక్కువ. కుటుంబ బాధ్యతలు, పిల్లల చదువు కారణంగా చాలామంది మహిళలు చేస్తున్న జాబ్ నుంచి క్విట్ అవుతున్నారు. తిరిగి రీజాయిన్, సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టే సమయానికి వేగంగా మారుతున్న జాబ్ మార్కెట్ నుంచి టఫ్ కాంపిటీషన్ ను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మహిళల కోసం సూటబుల్ అయ్యే ఏఐ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ను రెగ్యులర్ గా కండక్ట్ చేస్తూ.. వారిలో స్కిల్స్ పెరిగేలా చూడాలి.
- గతేడాది 15లక్షల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లలో 10 శాతం మందికే ఉద్యోగాలు రావడం చూస్తే.. బయట జాబ్ డిమాండ్ ఏ లెవల్ లో ఉందో అర్థం చేసుకోండి.
- ట్రెండ్ ను ఫాలో అవ్వడం మాత్రమే కాక జాబ్ ట్రెండ్స్ ను తెలుసుకుంటూ.. స్కిల్స్ నేర్చుకోవడంలో ప్రో అయినప్పుడే ఈరోజుల్లో మంచి జాబ్ లో సెటిల్ అవ్వొచ్చు. AI Jobs in All Fields.