ఫోన్ అతిగా వేడెక్కితే.. ఇవి చేయండి!

నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ లేనిది ఎవరికి చెప్పండి.. వాడని వారు ఎవ్వరున్నారు. ఇలా సోషల్ మీడియాలో ఉంటూ.. నిత్యం ఫోన్ వాడేవారు.. ఈ వేసవి ఎండలకు అతిగా వేడెక్కడం లేదంటే హ్యాంగ్ అవుతున్నాయి. ఈ సమస్య అందరినీ కామన్ గా వేధిస్తుంది. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఫోన్ మెరుగ్గా పనిచేస్తుంది. అవేమిటంటే..

స్మార్ట్ ఫోన్లు పనిచేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ లో వేడిని ఉత్పత్తి చేస్తాయి. అది పరిమితికి మించి ఎక్కువ ఉంటే జాగ్రత్తపడాలి. సూర్యుడి నుంచి ఎండ డైరెక్టుగా ఫోన్ పై పడడం, వేడి వాతావరణం కారణంగా ఈ సమస్య అనేది తలెత్తుతుంది. ఎక్కువ యాప్ లు వినియోగించడం, వీడియోలు వీక్షించడం, ఎక్కువ సమయం గేమ్ లు ఆటడం వల్ల కూడా ఫోన్ వేడెక్కే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హానికరమైన సాఫ్ట్ వేర్ లు, అప్ డేట్లు వంటివి స్టోరేజి ఇష్యూస్ ను క్లియర్ చేసుకోకపోవడం కూడా కారణమవ్వొచ్చు.

అలాంటప్పుడు..

  • సూర్యుడి కాంతి డైరెక్టుగా ఫోన్ మీద పడకుండా
  • చూసుకోవాలి. బయట తిరిగే సమయంలో నీడ ఉన్న ప్రాంతంలో ఫోన్ ను వాడాలి.
  • వేసవిలో ఎండ ఎక్కువగా ఉంటుంది. సైడ్ కి పార్క్ చేసిన కార్లలో సెల్ ఫోన్ ఉంచకూడదు. కారు లోపల పెరిగిన ఉష్ణోగ్రతతో ఫోన్ కు మరింత ఇబ్బంది కలుగుతుంది.
  • ఫోన్ స్క్రీన్ బ్రైట్ నెస్ ను ఎప్పటికప్పుడు తగ్గించుకోవాలి. దీనివల్ల చార్జింగ్ తో పాటు వేడి ఉత్పత్తి తగ్గుతుంది. ఇందుకోసం ఆటోమేటిక్ బ్రైట్ నెస్ సెట్టింగ్ లు చేసుకుంటే చాలు.
  • ఫోన్ లో ఎక్కువ యాప్ లు ఉంటే దాని ప్రభావం ప్రాసెసర్ పై పడుతుంది. తద్వారా వేడి ఎక్కువ విడుదల అవుతుంది. కాబట్టి అనవసర యాప్ లను మూసివేయాలి.
  • చాలామంది ఫోన్ లుక్ కోసం రకరకాల పౌచ్ లు, కవర్లు వాడుతుంటారు. వీటివల్ల ఫోన్ లో విడుదలయ్యే వేడి బయటకు వెళ్లే అవకాశం లేక ఒక్కోసారి పేలేందుకు దారి తీస్తుంది. అప్పుడు ఫోన్ కవర్ కాసేపు తీసి ఉంచాలి.
  • చాలాసార్లు ఛార్జింగ్ కోసం దొరికిన ఏదోటి ఛార్జ్ చేస్తుంటాం. అలా కాకుండా ఫోన్ మోడల్, కంపెనీ అందించిన ఛార్జర్లు, కేబుళ్లతోనే ఫోన్ కు ఛార్జింగ్ పెట్టాలి. వేరే ఛార్జర్లతో కూడా ఫోన్ వేడేక్కే అవకాశం ఉంది.
  • ఫోన్ ను వాడని సమయంలో బ్లూటూత్, జీపీఎస్ వంటి వాటిని ఆఫ్ చేయండి. దీనివల్ల ఫోన్ వేడెక్కకుండా ఉంటుంది.
  • సాఫ్ట్ వేర్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవడం వల్ల ఫోన్ స్పీడ్ గా వర్క్ చేస్తుంది.
  • ఎక్కువసేపు గేమ్స్ ఆడుతున్నా.. ఓటిటీల్లో గంటలకొద్దీ సిరీస్ లు చూస్తున్నా సరే ప్రాసెసర్ అనేది వేడెక్కిపోతుంది. అది చల్లారేందుకు కొంత విరామం ఇవ్వాలి.
  • ఫోన్ వేడిక్కేతే వెంటనే తాత్కాలికంగా స్విచ్ ఆఫ్ చేయాలి. అది చల్లబడిన తర్వాత మాత్రమే ఆన్ చేయాలి.
  • వీటిని ఫాలో అవుతున్నా.. మీ ఫోన్ తరచుగా వేడెక్కుతుంటే మాత్రం బ్యాటరీ మార్చడం, ఇతర ఇంటర్నల్ సమస్యలు ఉన్నట్లు గుర్తించి.. టెక్నీషియన్ దగ్గరకు తీసుకువెళ్లి మార్పించుకోవడం ఉత్తమం.