
కొత్త ఐఫోన్ కొన్నారా? పాత ఐఫోన్ నుంచి డేటా మొత్తం బదిలీ చేసుకొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించండి. థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్, యాప్స్ లాంటివేవి అవసరం లేకుండానే పాత ఐఫోన్ అప్లికేషన్స్, ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నిటినీ సింపుల్ గా కొత్త ఫోన్ లోకి మార్చుకోవచ్చు. అదెలాగంటే..
- పాత ఫోను నుంచి కొత్తదానిలోకి డేటాను ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు ఇది బాగా యూస్ అవుతుంది. ఇందుకోసం ముందుగా రెండు ఫోన్లలోనూ తగినంత బ్యాటరీ ఛార్జింగ్ ఉండేలా చూసుకోవాలి.
- పాత ఐఫోన్ లో బ్లూటూత్ ఆన్ చేసి, రెండు ఫోన్లనూ ఒకదానికొకటి దగ్గరగా ఉంచాలి.
- పాత ఐఫోన్ స్క్రీన్ పై ప్రాంప్ట్ కనిపించిన తర్వాత కొత్తదాన్ని ఆన్ చేసి ‘కంటిన్యూ’ ఆప్షన్ పై క్లిక్ ఇవ్వాలి.
- తర్వాత కొత్త ఐఫోన్ స్క్రీన్ పై యానిమేషన్ లా కనిపిస్తుంది. దాన్ని పాతఐఫోన్ కెమెరాతో స్కాన్ చేస్తే రెండు ఫోన్లూ ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతాయి.
- అప్పుడు కొత్త ఐఫోన్ లో పాస్ కోడ్ రిక్వెస్ట్ వస్తుంది.
- అప్పుడు మీ ఫోన్ ఐడీ, పాస్ వర్డ్ ఎంటర్ చేయాలి. ఎట్ ఏ టైం ఫేస్ ఐడీనీ కూడా సెట్ చేసుకోవచ్చు.
- తర్వాత ‘ట్రాన్స్ ఫర్ ఫ్రం ఐఫోన్’ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. డేటా మొత్తం ట్రాన్స్ఫర్ అయ్యేవరకు వేచి ఉండాలి.