ఇంస్టా లైవ్ ను ప్రైవేట్ చేసుకోండి..!

Make Instagram Live private: నేటి డిజిటల్ యుగంలో యూట్యూబ్, ఇన్స్టా గ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ లు పెరిగిపోయారు. టాలెంట్ ను, ఓన్ కంటెంట్ క్రియేషన్ ను మీడియంగా చేసుకొని ఎంతోమంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంటున్నారు. అలాంటప్పుడు కొన్నిసార్లు తమ ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యేలా లైవ్ పెట్టి మాట్లాడటం చూస్తూనే ఉన్నాం. అయితే ఇలా లైవ్ పెట్టిన సందర్భంలో అది ఫాలోయర్లు అందరికీ అవసరం లేదు.

కొంతమంది స్నేహితులకే దాన్ని పరిమితం చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే.. ముందు ప్లస్ బటన్ మీద తాకి, లైవ్ ను ఎంచుకోవాలి. తర్వాత షేర్ విత్ క్లోజ్ ఫ్రెండ్స్ ఆప్షన్ ను ఎంచుకొని ప్రసారాన్ని మొదలు పెట్టాలి. ఇందులో ఒకేసారి మూడు కాంటాక్టులను యాడ్ చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువమంది చూడాలనుకుంటే మోర్ (మూడు చుక్కలు) ద్వారా సెటింగ్స్ లోకి వెళ్తే వూ కెన్ సీ యువర్ కంటెంట్ అనేది ఉంటుంది. Make Instagram Live private

ఇందులోని క్లోజ్ ఫ్రెండ్స్ ఆప్షన్ తో ఇష్టమైన, కావాల్సిన కాంటాక్టులను మాత్రమే జత చేసుకోవచ్చు. దీనివల్ల ఎక్కువమంది తాము పంపే మెసేజెస్ ను చదవడం, బదులివ్వడం లాంటి వాటికి ఇబ్బంది ఏర్పకుండా లిమిటెడ్ వేలో లైవ్ ను సక్సెస్ ఫుల్ గా చేయడంలో హెల్ప్ చేస్తుంది.

Also Read: https://www.mega9tv.com/technology/upi-payments-will-be-implemented-soon-in-all-payments-apps/