
ప్రస్తుతం దేశంలోని సిటీ నుంచి మారుమూల గ్రామీణ ప్రాంతాల వరకు డిజిటల్ చెల్లింపులు చేసేటప్పుడు.. ఆన్లైన్ పేమెంట్ కోసం యూపీఐను ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. ప్రజలకు ఇంతలా చేరువైన యూపీఐపై తాజాగా కొన్ని కొత్త ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఆగస్టు 1, 2025 నుంచి యూపీఐ చెల్లింపుల విషయంలో పెద్ద మార్పులు చోటు చేసుకోనున్నాయి. యూపీఐ వ్యవస్థను నియంత్రించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ కొత్త ఏపీఐ రూల్స్ అనేవి అన్ని బ్యాంకులు, పేమెంట్స్ యాప్స్ కోసం అమల్లోకి తీసుకురానుంది. ఇవి ప్రస్తుతం ఉన్న చెల్లింపు వ్యవస్థలను మరింత సేఫ్ గా మార్చేందుకు తీసుకొస్తున్నారు. అయితే దీనివల్ల యూజర్స్ పై కొన్ని ఆంక్షలు కూడా చూసే అవకాశముందని తెలుస్తోంది. అవేమిటంటే..
NPCI తీసుకొస్తున్న కొత్త రూల్స్ కింద వినియోగదారులు ఒక యూపీఐ చెల్లింపు యాప్ లో తమ అకౌంట్ బ్యాలెన్స్ ను రోజుకు 50 సార్లు మాత్రమే చెక్ చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. పరిమితి దాటిన తర్వాత యూజర్లు ప్రయత్నించినప్పటికీ యాప్ రిక్వెస్ట్ పై స్పందించదు. ఒకవేళ ఏదైనా టెక్నికల్ కారణం లేదా ఇంటర్నెట్ సమస్యల వల్ల చెల్లింపు మధ్యలో నిలిచిపోయి.. పెండింగ్ లో పడితే వెంటవెంటనే దాని స్టేటస్ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించటం కుదరదు. ఎందుకంటే పేమెంట్ సిస్టమ్ పై లోడ్ భారాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.
యూజర్లు తమ యూపీఐ పేమెంట్ యాప్ లో ఎన్ని బ్యాంక్ ఖాతాలు లింక్ చేశారనే వివరాలను ఇకపై రోజుకు గరిష్ఠంగా 25 సార్లు చెక్ చేసుకునేందుకు మాత్రమే ఇకపై వీలుంటుంది.