
Open AI CEO Sam Altman: చాట్ జీపీటీపై అతిగా ఆధారపడొద్దని ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ వార్నింగ్ ఇచ్చారు. ఈమధ్య కాలంలోఎక్కడ విన్నా.. చాట్ జీపీటీ పేరే వినిపిస్తుంది. అంతేకాకుండా దీని వినియోగం రోజురోజుకూ పెరిగింది. ఇంకా ఏఐ తప్పుదోవ పట్టించే విధంగా లేదా తప్పుడు సమాచారాన్నిచ్చే అవకాశం కూడా ఉందని చెబుతూ.. దానిని ఎక్కువగా నమ్మొద్దని.. ఓపెన్ ఏఐ కొత్తగా నిర్వహిస్తోన్న పాడ్ కాస్ట్ తొలి ఎపిసోడ్ లో ఆయన పాల్గొనగా.. ఏఐ చాట్ బాట్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నప్పటికీ.. అది ఇచ్చే సమాచారంపై అతివిశ్వాసం పనికిరాదంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అవును… ప్రస్తుతం కాలంలో ‘చాట్ జీపీటీ’కి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచంలోని ఏ విషయంపై అయినా, ఎలాంటి ప్రశ్న అడిగినా లేదనకుండా సమాధానం చెబుతుండటంతో స్టూడెంట్స్ నుంచి ప్రొఫెషనల్స్ వరకూ ఎంతోమంది వినియోగిస్తున్నారు. మరికొంతమంది దీనిపై పూర్తిగా డిపెండ్ అయిపోతున్నారు. Open AI CEO Sam Altman.
అయితే.. ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ఎన్నో ప్రయోజనాలున్నప్పటికీ, అది ఇచ్చే సమాచారంపై అతి విశ్వాసం పనికిరాదని, అసలు ఉనికిలో లేని అంశానికి కూడా చక్కగా తప్పుడు సమాచారం ఇస్తుంటుందని ఆయన హెచ్చరిక జారీ చేశారు. దీంతో ఈ విషయం అంతటా ఆసక్తికరంగా మారింది.
తాను తండ్రిగా మారిన తర్వాత చాట్ జీపీటీపై అతిగా ఆధారపడటం మొదలుపెట్టానని చెప్పిన ఆల్ట్ మన్.. వాస్తవిక ప్రపంచంలోనే అసలైన శక్తి ఉంటుందన్నారు. ప్రస్తుతం మనం అత్యంత శక్తిమంతమైన యుగం ప్రారంభంలో ఉన్నామని, ఈ సమయంలో జాగ్రత్తగా లేకపోతే విశ్వసనీయతకు అసలు అర్థం లేకుండా పోతుందని ఆల్ట్ మన్ క్లారిటీ ఇచ్చారు.
Also Read: https://www.mega9tv.com/technology/all-videos-on-facebook-will-now-comes-in-reels-format-only/