స్క్రీన్ లేదు.. గూగుల్ చేయనక్కర్లేదు.. అయినా ఏఐలా పని చేస్తుంది..!

Sam & Jony introduce io: స్మార్ట్ ఫోన్ లు రోజుకో ఇన్నోవేషన్ తో.. డిఫరెంట్ లుక్ అండ్ డిజైన్ లో.. అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో వస్తున్నాయి.

ఇప్పుడు మరి వింతగా స్క్రీన్, యాప్స్ ఇన్స్టలేషన్, కీబోర్డు లాంటివేవి లేకుండా.. ఒక కొత్త రకం మొబైల్ తరహా పరికరం త్వరలో మన ముందుకు రాబోతుందట..
ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మైన్, ఐఫోన్ డిజైనర్ జానీ ఐవ్ లు కలిసి అచ్చం ఇలాంటి ఏఐ పరికరాన్ని రూపొందించడంపై ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

వీరిద్దరూ ఇటీవల దీని గురించి చర్చించుకున్న వీడియో కాస్త చాలా ఇంట్రెస్ట్ ను రేకెత్తిస్తుంది. ఇది రాబోయే రోజుల్లో టెక్నాలజీతో మన ఇంటరాక్షన్ ను గొప్పగా మారుస్తుందట. నిజానికిది ఫోన్ కాదు. అలాగనీ దాన్ని రీప్లేస్ చేయదు. పూర్తిగా ఒక సరికొత్త డివైజ్ గా చెప్పవచ్చు. ఐఓ అనే సంకేత నామంతో దీన్ని ప్రస్తుతం పిలుస్తున్నారు.

ఇది వాట్సప్, ఇన్స్టాగ్రామ్ వంటి ఎలాంటి యాప్ లను చూపించదు, సపోర్ట్ చేయదు. అయినా మన మాటలను వింటుంది, నేర్చుకుంటుంది, సాయం చేస్తుంది. ఒకరకంగా జేబులో ఏఐ మెదడు చిప్ ను పెట్టుకున్నట్టే అన్నమాట. ఈ పరికరంతో మాట్లాడితే, అది తిరిగి మనతో మాట్లాడుతుంది. అందుకు బదులిస్తుంది. మీటింగ్స్, ఎంగేజ్మెంట్స్ ముఖ్యమైన వాటిని గుర్తు చేస్తుంది. ఐడియాలను అందిస్తుంది. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు రూట్ చూపిస్తుంది. అదీ కూడా మనం ఫోన్ స్క్రీన్ ను ఓపెన్ చేయకుండానే..

ఒక్క పదమైనా టైప్ చేయాల్సినవసరమూ లేకుండానే అంటే, వింతగా ఉంది కదూ.. నిజానికి ఈ పరికరం మన నుంచే నేర్చుకుంటుంది. మాట్లాడే మాటలు, చేసే ప్రయాణాలు, ఉద్యోగం తీరు తెన్నులను బాగా దగ్గర్నుండి గమనిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే యూజర్ పరిసరాలు, వ్యక్తిగత, వృత్తి జీవితం గురించి పూర్తి అవగాహన కలిగి ఉంటుంది. Sam & Jony introduce io

ఐఫోన్, ఐప్యాడ్, ఐమ్యాక్ వంటి స్క్రీన్ బేస్డ్ ప్రపంచాన్ని సృష్టించిన జానీ ఐవీనే ఇప్పుడు తెరల నుంచి విముక్తి కలిగించే ప్రయత్నం చేస్తుండటం విచిత్రం. అయితే ఇదేమీ రాత్రికి రాత్రి వెంటనే సాధ్యమయ్యే పని కాదు. వచ్చే ఏడాదిలో ఈ పరికరం అందుబాటులోకి రావొచ్చని భావిస్తున్నారు.

ఇది టెక్నాలజీతో మనిషికి కొత్తరకం అనుబంధం సృష్టించగలదని నమ్ముతున్నారు. ఇప్పటికే చడీచప్పుడు చేయకుండా ఏఐ మన జీవితాల్లో మెలుగుతుంటే.. ఈ కొత్త పరికరం నిజంగానే క్రేజీగా ఉంది కదా!

Also Read: https://www.mega9tv.com/technology/check-online-fraud-through-google-safety-charter/