డిజి పిన్ తో మీ చిరునామా పదిలం!

ఇళ్లు, స్థలాలను మరింత అక్యురేట్ గా, ఈజీగా గుర్తించేందుకు ఈ ప్రత్యేక డిజిటల్ ఐడీ అయిన డిజి పిన్ అనేది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆన్లైన్ డోర్ డెలివరీ సేవలను మరింత సజావుగా, సమర్ధవంతంగా అందించడానికి ఇది ఎంతగానో సాయపడుతుంది. అలాగే ఎమర్జెన్సీ సమయంలో, అత్యవసర సేవలు కావాల్సి వచ్చినప్పుడు GPS ఆధారంగా కచ్చితమైన స్థలానికి కావాల్సిన సేవలు అందించేందుకు వెంటనే చేరుకోవచ్చు.

మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చిరునామా సరిగా లేకపోయినా.. GPS ఆధారంగా ఫలానా ప్రాంతాన్ని గుర్తించగలుగుతుంది. ఇది అడ్రస్ డేటా చోరీ కాకుండా కాపాడుతోందన్నమాట. స్పష్టమైన నిబంధనలు లేకపోవడంతో, కొన్ని ప్రైవేట్ సంస్థలు వ్యక్తుల అనుమతి లేకుండానే వారి చిరునామా సమాచారాన్ని సేకరించి దుర్వినియోగం చేస్తున్నాయి. ఇటువంటి వాటిని అరికట్టేందుకు దేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) వ్యవస్థకు చిరునామాల్ని జోడించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది.

మీకు చెందిన డిజిపిస్ కోడ్ ను ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకోండి. https://dac.indiapost.gov.in/mydigipin/home

ఇందులో మీరు మ్యాప్ లో మీ ఇంటి ఏరియాని గుర్తించి, మీ డిజిపిన్ ను జనరేట్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంది. డిజిపిన్ జనరేట్ చేయడానికి ఉపయోగించే కోడ్ ను ప్రభుత్వం పబ్లిక్ డొమైన్ లో ఉంచింది. దీనివల్ల ఇంటర్నెట్ లేకపోయినా డిజిపిన్ ను క్రియేట్ చేయడానికి వీలవుతుంది.
అలాగే ఇది పాత చిరునామాను తొలగింస్తుందనే అనుమానాలు అవసరం లేదు. ఈ డిజిపిన్ మీ పాత చిరునామాను రీప్లేస్ చేయదు. ఇది అడిషనల్ డిజిటల్ చిరునామాగా యూస్ అవుతుంది. భవిష్యత్తులో సర్వీసులందించడంలో, ప్రతి ఒక్కరి ఇంటి కొత్త చిరునామాను అందివ్వడంలో ముందు ఉండబోతుంది.