ఒత్తిడి ఎంత ఉందో ఇట్టే చెప్పే.. స్మార్ట్ డెంటల్ ఫ్లాస్!

Smart dental floss: వయసుతో సంబంధం లేకుండా చిన్నాపెద్దా అందరినీ ఒత్తిడి అంతో ఇంతో ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఉద్యోగం.. చదువు.. ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్లనో.. ఈరోజుల్లో అందరికీ స్ట్రెస్ కామన్ అయిపోయింది. అలాగని దాన్ని తేలిగ్గా తీసుకుంటే క్రమంగా బ్లడ్ ప్రెషర్ కి దారితీస్తుంది. ఆ తర్వాత తీవ్రమైన గుండెజబ్బులకీ కారణమవొచ్చు. అలాంటప్పుడు పరిస్థితి అంతవరకూ వెళ్లకూడదంటే మనలో ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో తెలుసుకుని, కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది.

కానీ ఇదేమంత తేలికైన పనికాదు. తీవ్రమైన ఒత్తిడితో సతమతమయ్యేవారు కూడా సైకియాట్రిక్ దగ్గరకు వెళ్లి, వాళ్లు పెట్టే పరీక్షల్లో పాల్గొన్న తర్వాతే స్ట్రెస్ లెవల్ తెలుస్తుంది. ఇందుకు టైం కూడా పడుతుంది. ఇన్ని చిక్కుల్లేకుండా రియల్ టైమ్ లో ఒత్తిడి స్థాయిని పసిగట్టేందుకు అమెరికాలోని టఫ్ట్స్ యూనివర్సిటీ పరిశోధకులు స్మార్ట్ డెంటల్ ఫ్లాస్ ను ఆవిష్కరించారు. ఇదెలా ఉపయోగపడుతుందంటే..

మనం ఒత్తిడికి బాగా లోనైనప్పుడు ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు శరీరం కార్టిసాల్ హార్మోన్ ను విడుదల చేస్తుంది. ఇది మన నోటి లాలాజలంలో కలుస్తుంది. రోజూ నోటిని శుభ్రం చేయడానికి వాడే ఈ స్మార్ట్ డెంటల్ ఫ్లాస్ అనేది అటు నోటిలోని వ్యర్ధాలను తొలగించడంతోపాటు, లాలాజలంలో కలిసిన కార్టిసాల్ మోతాదు వివరాలనీ సేకరించి యాప్ ద్వారా వైద్యులకు తెలియజేస్తుంది. ఈ విధానం ద్వారా చాలా వేగంగా, తేలిగ్గా ఒత్తిడి స్థాయిని తెలుసుకోవచ్చు. దీంతో ఈజీ అండ్ సేఫ్ గా రోజువారీ స్ట్రెస్ ట్రాకింగ్ ను చేయవచ్చు. తద్వారా నియంత్రణపై ఫోకస్ పెట్టవచ్చు. Smart dental floss.

Also Read: https://www.mega9tv.com/technology/keratology-ortho-k-lenses-this-special-lenses-have-arrived-so-you-dont-have-to-wear-glasses/