స్పామ్ మెయిల్స్ ఒక్క క్లిక్ తో మాయం..!

మనం వాడే జిమెయిల్ లో ఎన్నో మెయిల్స్ అనేవి వస్తుంటాయి. అందులో కొన్ని ఇంపార్టెంట్ వి ఉండొచ్చు. కొన్ని స్పామ్ మెయిల్స్ ఉండొచ్చు. అలాంటప్పుడు మీరు ప్రతి ఇమెయిల్‌ను వెతికి.. అన్‌సబ్‌స్క్రైబ్ చేయాల్సి రావడం.. ఎంతో టైం వృథా పని. అలా కాకుండా మీరు వెతకాల్సిన అవసరం లేకుండా ఒకే క్లిక్‌తో ఎలా క్లియర్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం..

ప్రతిరోజూ రకరకాల మెయిల్స్ మన మెయిల్ ఇన్ బాక్స్ కి వస్తుంటాయి. అవి ఇన్‌బాక్స్ నిండేలా చేస్తాయి. మనం వాడే క్రెడిట్ కార్డు, బ్యాంక్ స్టేట్మెంట్ లు, ఇతర కంపెనీ ఆఫర్లు, అమ్మకాలు, అప్లికేషన్ అప్‌డేట్‌లు మొదలైన మెయిల్స్ రోజూ కుప్పలు తెప్పలుగా వస్తుంటాయి. అటువంటప్పుడు ముఖ్యమైన వాటికి, రిప్లై ఇవ్వాల్సిన వాటికి సమాధానం ఇవ్వడానికి చాలాసార్లు లేట్ అవ్వొచ్చు. అలాంటప్పుడు.. ఈ జిమెయిల్ కొత్త ఫీచర్ ‘Manage Subscriptions’ మీ సమస్యలను తొలగిస్తుంది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ నేపథ్యంలో జిమెయిల్ తన వినియోగదారులకు ‘Manage Subscriptions’ ఎంపికను అందిస్తోంది. ఇది మ్యాజిక్ బటన్ లాగా పనిచేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా మీ ఇన్‌బాక్స్ క్లీన్ అండ్ క్లియర్‌గా ఉంటుంది. దీనిలో మీరు అదే టైంలో సబ్‌స్క్రిప్షన్ మెయిల్‌లను చూడవచ్చు. ఎప్పుడు చూడాలనుకున్న వాటిపై క్లిక్ చేస్తే, యాక్టివేట్ అవుతుంది.
మీరు ప్రతి ఇమెయిల్‌ను తెరిచి అన్‌సబ్‌స్క్రైబ్ చేయవలసినవసరం ఉండదు. మీరు వెతకాల్సిన అవసరం కూడా ఉండదు. మీ అన్ని సబ్‌స్క్రిప్షన్ ఇమెయిల్‌లు ఒకే క్లిక్‌తో పోతాయి. మీకు అవసరమైన ఇమెయిల్‌లను మీరు వదిలివేయవచ్చు. అలాగే మిగిలిన వాటి నుంచి సబ్స్క్రిప్షన్ తీసేయొచ్చ.

ఈ ఫీచర్‌ని యాక్టివేట్ చేయడానికి ముందుగా మీరు Gmail యాప్, వెబ్ వెర్షన్ రెండింటిలోనూ ‘సబ్‌స్క్రిప్షన్‌లను నిర్వహించు’ అనే ఎంపిక కనిపిస్తుంది. ముందుగా మీరు మీ Gmailని ఓపెన్ చేసి, ఇన్ బాక్స్ కి వెళ్ళాలి. మీకు ఎడమ వైపున ప్రమోషన్లు, సోషల్, స్పామ్‌లో ఈ ఎంపిక అనేది కనిపిస్తుంది.
ఇక్కడ మీరు మీకు ఏ మెయిల్ ఉపయోగకరంగా ఉందో, దేనిని సేవ్ చేయాలనుకుంటున్నారో ఎంచుకోవచ్చు. స్టోరేజీని మాత్రమే ఆక్యుపై చేస్తున్న మెయిల్‌ను ఒకే క్లిక్‌తో తొలగించవచ్చు. ఇది మీ Gmail స్టోరేజీ నిండకుండా చేస్తుంది.