ఇతర భాషలు మాట్లాడండి మరింత ఈజీగా..!

ఈ మధ్య ఇంగ్లీష్ అందరూ మాట్లడగలుగుతున్నారు. దాని అవసరం అంతటా పెరిగిపోయింది. రీజినల్ లాంగ్వేజ్ తో పాటు ఇంగ్లీష్ మాట్లాడటం ముఖ్యమైపోయింది. అయితే విదేశాల్లో ఉద్యోగరీత్యా.. ట్రావెల్ సమయంలో కమ్యూనికేషన్ కోసం విదేశీ భాషలో మాట్లాడలేకపోతున్నమని చిన్న ఆత్మన్యూనతాభావం కలుగుతుంది. ఇకపై ఆ బాధ పడనవసరం లేదు. గూగుల్ ‘లిటిల్ లాంగ్వేజ్ లెసన్స్‌’(Little Language Lessons) తో ఎంతో ఈజీగా మీరు నేర్చుకోవాలనుకున్న విదేశీ భాషలు నేర్చుకోవచ్చు. మీ బిజీ షెడ్యూల్‌తోపాటు చాలా తక్కువ సమయంలోనే ఎంచుకున్న ఫారిన్‌ లాంగ్వేజ్‌పై పట్టు సాధించవచ్చు. ఇంటరాక్టివ్ సెషన్స్‌ కూడా దీనికి ఎంతో హెల్ప్ అవుతాయి.

ఈ గూగుల్ ‘లిటిల్ లాంగ్వేజ్ లెసన్స్‌’ టూల్‌ ద్వారా విదేశీ భాషకు చెందిన వర్డ్స్, వర్డ్ ఫ్రేమింగ్, సెంటెన్స్ మేకింగ్, వాక్ బ్లరీ కూడా ఎంతో సులభంగా నేర్చుకోవచ్చు. అలాగే గూగుల్‌ ట్రాన్స్‌లేటర్‌తో కలిసి ఉన్న ఈ టూల్‌తో చాలా త్వరగా, తేలికగా విదేశీ భాషలో మీరు మాట్లాడవచ్చు. ట్రాన్స్లేట్ ద్వారా తెలియని పదాలకు అర్థాలు తెలుసుకోవచ్చు. దీంతో విదేశీ భాషలోని అర్థంకాని పదాలపై అవగాహనతో పాటు ఆ భాషను పూర్తిగా అర్థం చేసుకునేందుకు ఈ టూల్‌ ఉపయోగపడుతుంది.

మరోవైపు విదేశీ భాష పలికేందుకు, ఉచ్చారణ కోసం వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీ ఎంతో హెల్ప్ అవుతుంది. సో ఇందులోని ఫీచర్స్ ను ప్రాక్టికల్ గా తెలుసుకోవడంతో పాటు కొన్నిరోజుల్లోనే సులువుగా నేర్చుకోవడం, మాట్లాడటం, తక్కువ సమయంలోనే దానిపై పూర్తిగా పట్టుసాధించవచ్చు.
సో మీకిష్టమైన లాంగ్వేజ్ ను ట్రై చెయ్యండి.