
Tatkal Tickets booking: ఈసారి జులై నెల నుంచి ఆర్థికంగా అనేక మార్పులు రాబోతున్నాయి. అందులో చాలావరకు మనపై నేరుగా ప్రభావం చూపేవే ఉన్నాయి. తత్కాల్ రూల్స్, ఆధార్-పాన్, క్రెడిట్ కార్డులకు సంబంధించినవే. కాబట్టి అవేంటో తెలుసుకుందాం:
పాన్ కు ఆధార్ కంపల్సరీ:
పాన్ కార్డు తీసుకోవాలంటే ఇకపై ఆధార్ తప్పనిసరిగా ఉండాల్సిందేనట. జులై 1 నుంచి పాన్ కోసం ఆధార్ నంబర్, ఆధార్ వెరిఫికేషన్ ను సీబీడీటీ తప్పనిసరి చేసింది. ప్రస్తుతం ఏదైనా మన ఐడెంటిఫికేషన్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్ లాంటివి ఉంటే పాన్ ఒకే చేసి ఇచ్చేవారు. కానీ ఇకపై పాన్ కార్డు తీసుకోవాలంటే మాత్రం ఆధార్ వివరాలు తప్పక ఇవ్వాల్సిందే. పాన్-ఆధార్ లింక్ తప్పనిసరి అయిన నేపథ్యంలో ఇది కొత్త మార్పుగా చెప్పవచ్చు.
తత్కాల్ రూల్స్:
- ఆధార్ ఆథేంటికేషన్ పూర్తి చేసుకున్నవారికి మాత్రమే జులై 1 నుంచి రైల్వే తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే ఛాన్స్ ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. టికెట్ల బుకింగ్ విషయంలో జరిగే అన్ నౌన్ ట్రాన్సాక్షన్స్, అక్రమాలను అరికట్టేందుకు ఈ రూల్ తీసుకొచ్చినట్లు రైల్వే శాఖ తెలిపింది.
- జులై 15 నుంచి బుకింగ్ సమయంలో ఆధార్ ఓటీపీని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇదే కాక రైల్వే శాఖ.. రైల్వే ఆధీకృత ఏజెంట్లు తత్కాల్ బుకింగ్ స్టార్ట్ అయిన 30 నిమిషాల తర్వాతే టికెట్లు బుక్ చేసే అవకాశమిచ్చింది.
- అంటే ఏసీ టికెట్ కి ఉదయం 10.30, నాన్ ఏసీకైతే 11.30 గంటల తర్వాత మాత్రమే టికెట్లు ఇకపై బుక్ చేసుకోగలరు. జులై 15 నుంచి ఈ రూల్ అమల్లోకి రానుంది.
- మెయిల్/ ఎక్స్ ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ ప్రయాణానికి కిలోమీటరుకు ఒక పైసా, ఏసీ తరగతులకు 2 పైసల చొప్పున ధరలు పెంచింది. 500 కిలోమీటర్లు దాటాక సెకండ్ క్లాస్ ప్రయాణానికి ప్రతి కిలోమీటరుకు ఒక పైసా వర్తిస్తుంది. పెరిగిన ధరలు జులై 1 నుంచే అంటే ఈరోజు నుంచే అమలవుతాయి. Tatkal Tickets booking.
క్రెడిట్ కార్డు రూల్స్ మార్పు:
హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ క్రెడిట్ కార్డు నిబంధనల్లో కొన్ని మార్పులు చేసింది. రూ.10వేలు పైన వాలెట్ లోడింగ్, రూ.5 వేలు పైన యుటిలిటీ పేమెంట్లు, రూ.10 వేలు దాటిన గేమింగ్ ట్రాన్సాక్షన్లపై ఇకపై 1% ఫీజు వర్తిస్తుంది.
అన్ని రెంటల్ పేమెంట్లు, థర్డ్ పార్టీ అప్లికేషన్ల ద్వారా చేసే ఎడ్యుకేషన్ పేమెంట్ల పైన 1% ఫీజు పడనుందని తెలుసుకోవాలి. ఆన్లైన్ గేమింగ్ ట్రాన్సాక్షన్స్ పై వచ్చే రివార్డ్ లను పూర్తిగా తీసేసింది. ఈ రూల్స్ అనేవి జులై 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి.
ఐటీఆర్ ఫైలింగ్:
వాస్తవానికి జూన్, జులై నెలలంటే.. కామన్ గా ఐటీఆర్ ఫైల్ చేసే టైం.. ఇందుకోసం టాక్స్ పేయర్స్ ఎదురు చూస్తుంటారు. అలాంటి ఐటీఆర్ ఫార్మ్ లలోనూ మార్పులు చేయడం జరిగింది. ఫైలింగ్ గడువును కేంద్రం సెప్టెంబర్ 15 వరకూ పొడిగించింది కాగా ట్యాక్స్ పేయర్ కి 45రోజుల పాటు అడిషనల్ గా టైం దొరికింది. ఒకవేళ అన్ని పేపర్స్ మీ దగ్గరుంటే మాత్రం గడువు తేదీతో సంబంధం లేకుండా రిటర్న్ లు దాఖలు చేయడం మంచిది.