ఎక్కువసేపు మొబైల్ చూస్తే అంతే సంగతి..

ఇప్పుడు నడుస్తున్నది సాంకేతిక యుగం.. రోజులో 24 గంటలు సరిపోవడం లేదు. రోజురోజుకీ అవసరానికి మించి వీటిమీద ఆధారపడిపోతున్నాం. ఒక సరదా అయినా సంతోషమైనా, దుఃఖమైనా, తినాలని ఉన్నా.. కొనాలని ఉన్నా.. అన్ని ఇప్పుడు మనుషులతో కాకుండా పరికరాలతో పంచుకుంటున్నాం. అయితే ఇటీవల జరిపిన కొన్ని
కొత్త అధ్యయనాలు ఏం చెపుతున్నాయంటే ఎక్కువ మొబైల్స్, ల్యాప్ టాప్స్, ట్యాబ్స్ తో సమయం గడిపితే త్వరగా వృద్ధాప్యం వస్తుందట..
ఎక్కువ సమయం ఫోన్ స్క్రీన్ చూడటం వల్ల చర్మం, మెదడు కణాలపై ఒత్తిడి, చెడు ప్రభావం చూపుతుందని తేల్చింది.

అంతేకాకుండా టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్‌ల వంటి రోజువారీ ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వెలువడే బ్లూ లైట్‌ అధికంగా మన కళ్లపై పడుతుంది. దీనినుంచి పిల్లలు, పెద్దలు హానికరమైన ప్రభావాలకు గురి అవుతున్నారు. ఇవి కణాల నుంచి న్యూరాన్ల వరకు మన శరీరంలోని జీవక్రియ స్థాయిలను ప్రభావితం చేస్తాయని తేలింది.

నీలి కాంతిలో మెటాబోలైట్ సక్సినేట్ స్థాయిలు పెరుగుతాయి. ఇవి ప్రతి కణం పనితీరును పెరుగుదలను నియంత్రిస్తాయి. ఈ బ్లూ కిరణాలు మన శరీరం మీద పడటం వల్ల శరీరంలోని శక్తి కణాలు ఆటోమేటిక్ గా క్షీణిస్తాయి. అలా నెమ్మదిగా వృద్ధాప్య ఛాయలు మొదలవుతాయి. గ్లుటామేట్ స్థాయిలు అనేవి పెరగడం వల్ల మెదడు పనితీరును మందగిస్తుంది. దీనర్థం శరీరం, మెదడు నీలి కాంతి ప్రభావంతో ఆక్టివ్ నెస్ ను కోల్పోయి లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఎంత అవసరమున్నా.. లిమిట్ లో వాడితో ఏదైనా మంచే చేస్తుంది.