వైఫై స్పీడ్ పెరగాలంటే.. ఈ మార్పులు చేయండి!

నేటి డిజిటల్ యుగంలో హైస్పీడ్ వైఫై కనెక్షన్ అవసరం బాగా పెరిగింది. ఆన్లైన్ క్లాసులు, షాపింగ్ చేయడం, సోషల్ మీడియా అప్డేట్స్ చూడటం.. వైగరా.. పనుల కోసం మనకు డేటా ముఖ్యం. కొన్నిసార్లు మనం కోరుకున్నంతగా మన వైఫై స్పీడ్ దొరకదు. మీ వైఫై వేగాన్ని సూపర్‌ఫాస్ట్‌గా మార్చే కొన్ని సెట్టింగ్‌లు ఉన్నాయి. అవేంటో చూద్దాం..

వైఫై స్పీడ్ అయ్యేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటిని ఫాలో అయితే మీ వైఫై స్పీడప్‌ అవుతుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. రూటర్ ప్లేస్ చేసిన చోటు వైఫై వేగంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. ఇంటి మధ్యలో లేదా అన్ని గదులకు సిగ్నల్స్ బాగా చేరే ప్రదేశంలో ఉంచండి. ఎలక్ట్రానిక్ పరికరాలు (మైక్రోవేవ్, టీవీ లాంటివి) సిగ్నల్‌కు అంతరాయం కలిగించే అవకాశం ఉంటుంది. అందువల్ల రూటర్‌‌ను వాటి నుంచి దూరంగా ఉంచాలి.

కొన్నిసార్లు అవైలబుల్ వైఫై నెట్‌వర్క్‌ల కారణంగానూ ఈ అంతరాయం ఏర్పడుతుంది. ఇది వైఫై వేగాన్ని ఆటోమేటిక్ గా తగ్గిస్తుంది. దీనికోసం రూటర్ ఛానెల్‌ని మార్చడం మంచిది. మీరు రూటర్‌ సెట్టింగ్‌లలోకి వెళ్లి ఆటో లేదా తక్కువ రద్దీ ఉన్న ఛానెల్‌ అనే ఆప్షన్ ని ఎంచుకోవచ్చు. రూటర్‌ కంపెనీలు నెట్‌వర్క్ స్పీడ్, సేఫ్టీనీ మెరుగుపరిచే కొత్త అప్‌డేట్‌లను కాలానుగుణంగా విడుదల చేస్తాయి. ఆ అప్డేట్లను దృష్టిలో ఉంచుకొని మీ రూటర్‌ ఫర్మ్‌వేర్‌ను అప్‌డేట్‌ చేయండి చాలు. దీనిద్వారా కొత్త ఫీచర్లు, బెటర్ యూసేజ్ ప్రయోజనాన్ని మరింత పొందవచ్చు.

చాలావరకు కొత్త రూటర్‌లు 2.4GHz, 5GHz బ్యాండ్‌లను కలిగి ఉన్నాయి. 5GHz బ్యాండ్‌లో తక్కువ ఆటంకాలు ఉంటాయి. వేగం కూడా బాగుంటుంది. అయినప్పటికీ దాని పరిధి కొంచెం తక్కువ. మీకు మెరుగైన వేగం అవసరమైన ఇంట్లో ఏ ప్రాంతంలోనైనా మీరు దీన్ని ఉపయోగించవచ్చు. ఇది కాకుండా ఒకే సమయంలో ఎక్కువమంది వైఫై కనెక్ట్ చేసినట్లయితే వేగం అనేది తగ్గుతుంది. అందుకే ఉపయోగంలో లేనివాటిని వెంటనే డిస్‌కనెక్ట్ చేయండి. పైన చెప్పిన ఈ సెట్టింగ్‌లను ఫాలో అవ్వడం వల్ల మీరు మీ వైఫై వేగాన్ని గణనీయంగా మెరుగుపరచవచ్చు.