
AI Powered English Coach: చదువైనా.. జాబ్ లేదా బిజినెస్.. ప్రొఫెషన్ ఏదైనా ప్యాషన్ కి తగ్గట్టు కెరీర్ బిల్డ్ అవ్వాలంటే మాత్రం.. ఈరోజుల్లో అతి ముఖ్యమైన, అవసరమైన ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి తప్పనిసరి. మార్కెటింగ్ ఫీల్డ్ లో కమ్యూనికేషన్ కీ రోల్ ప్లే చేస్తున్న క్రమంలో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కోసం ఇదివరకే ఎన్నో ఇన్స్టిట్యూట్ లు, ఆన్లైన్ క్లాస్ లు వచ్చాయి.
ఇలాంటివి ఎన్ని విన్నా.. ఎన్ని ఫాలో అయినా.. మాట్లాడటంలో క్లారిటీ రావడానికి, నిర్మొహమాటంగా మాట్లాడటానికి ఇబ్బంది పడుతుంటాం. అయితే ఈపాటికే ఎన్నో యూట్యూబ్ ట్యుటోరియల్స్ సైతం ఉన్నప్పటికీ.. నేటి ఏఐ టెక్నాలజీ.. మరింత అడ్వాన్స్డ్ అవుతూ.. చాలా ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడటంలో సాయపడేందుకుl Al-Powered English Coach అనే యాప్ ను తీసుకొచ్చింది.
దీనిద్వారా సులువుగా ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పించడమే కాక ఫీడ్ బ్యాక్ కూడా ఇస్తుంది. ఇంగ్లీష్ పదాల ఉచ్చారణ, గ్రామర్, స్పీకింగ్ స్కిల్స్ నేర్పించడమే ప్రధానంగా తయారైంది ఈ ఏఐ బేస్డ్ మొబైల్ యాప్. యూజర్ల మాటలను ముందుగా రికార్డు చేసి, డీప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాయిస్ రికగ్నిషన్ సాయంతో వాటిని అనలైజ్ చేస్తుంది. AI Powered English Coach
వర్డ్స్, వర్డ్స్ ఫ్రేమింగ్ ఎలా యూస్ చేస్తున్నాం.. ఎలా పలుకుతున్నాం అనే విషయాలను వివరిస్తుంది. ఇది తెలుగు సహా 44 భాషల్లో వివరణలు, ఫీడ్ బ్యాక్ ను ఇస్తుంది. ఈ యాప్ లో 8,000కు పైగా లెసన్స్ ఉండటం విశేషం. జాబ్ ఇంటర్వ్యూలు, టోఫెల్ లాంటి ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యేవాళ్లకు ఇది బెనిఫిషియల్. ఈ యాప్ ఆండ్రాయిడ్ తోపాటు ఐవోఎస్ లో కూడా అందుబాటులో ఉంది. కాకపోతే.. ఫ్రీవెర్షన్ లో లిమిటెడ్ ఫీచర్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అన్ని ఫీచర్లు కావాలంటే ప్రో వెర్షన్ ను బై చేయాల్సి ఉంటుంది.