ఎర్లీగా యూపీఐ పేమెంట్స్.. త్వరలో అమల్లోకి రానుంది!

UPI payments will be implemented soon: నేడు దేశంలో ప్రతి చిన్న కొనుగోలుకు యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడం సర్వసాధారణమైపోయింది. అంతలా దాన్ని యూసేజ్ పెరిగింది. అయితే, ఏదైనా లావాదేవీ సక్సెస్ ఫుల్ గా పూర్తయ్యేందుకు ఒక్కోసారి ఎక్కువ టైం పడుతుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత సక్సెస్ అనే నోటిఫికేషన్ వచ్చాకే లావాదేవీ పూర్తయినట్టు అవతలివారు భావిస్తారు. కొన్నిసార్లు దుకాణాల వద్ద ఇలాంటి చెల్లింపులు చేసే క్రమంలో ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తుంది.

ఒక్కోసారి అది ప్రాసెసింగ్ లో పడి, టైం ఎక్కువగా తీసుకుంటుంది. దీన్ని రెక్టిఫై చేసేందుకు పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పీసీఐ) ఇటీవల కొన్ని మార్గదర్శకాలను అమల్లోకి తీసుకురానుంది. దీనిద్వారా యూపీఐ లావాదేవీలు మరింత వేగంగా జరుగుతాయి. ముఖ్యంగా బ్యాలెన్స్ చెకింగ్ చేయడం, ఆటో పేమెంట్, రిక్వెస్ట్ పే-రెస్పాన్స్ పే వరకు అనేక రకాల యూపీఐ లావాదేవీలకు ఇప్పుడు పట్టే సమయంలో దాదాపు 50% ఎర్లీగా అయ్యే అవకాశం ఉందన్నమాట.

ఎన్ పీసీఐ తాజా ఆదేశాల ప్రకారం, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ట్రాన్సక్షన్ సమయం ఇకపై కేవలం 15 సెకన్లలో పూర్తవుతుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియకు 30 సెకన్ల సమయం పడుతోంది. అదేవిధంగా ట్రాన్సాక్షన్ స్టేటస్, అడ్రస్ వ్యాలిడేషన్, ట్రాన్సాక్షన్ సమయం కూడా 30 సెకన్ల నుంచి 10 సెకన్లకు తగ్గుతుంది. యూపీఐ పేమెంట్స్, ట్రాన్సక్షన్స్ ఎక్కువగా వాడే కస్టమర్లకు మరింత మెరుగైన సేవలందించేందుకు ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. UPI payments will be implemented soon!

ఇందుకు సంబంధిత బ్యాంకులతో పాటు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు కూడా ఎన్ పీసీఐ ఆదేశాలు జారీ చేసింది. యూపీఐ సిస్టమ్ ఆగస్టు నుంచి కూడా ఇతర ముఖ్యమైన మార్పులను అమలు చేయనుంది. అందులో ప్రధానంగా, బ్యాలెన్స్ ఎంక్వైరీకి సంబంధించి కస్టమర్లు ఒక రోజులో 50 కంటే ఎక్కువసార్లు చేసే వీలుంటుంది. అదేవిధంగా పెట్టుబడులు, ఓటీటీలకు చేసే ఆటోమెటిక్ చెల్లిపులకు పీక్-అవర్స్(రద్దీ సమయం) కానప్పుడే ప్రాసెస్ చేయాలి. ఇటువంటి మార్పులన్నీ ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని సమాచారం.

Also Read: https://www.mega9tv.com/technology/meta-introduces-advertising-for-whatsapp-to-generate-revenue-its-plus-for-businessmen/