వీడియో ఎడిటింగ్ ఈ యాప్ తో.. ఇక సులువు..!

ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ క్రియేటర్లకు మరింత ఈజీ చేసేందుకు వీడియో ఎడిటింగ్ యాప్ వచ్చేసింది. ఆండ్రాయిడ్ యూజర్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. అదే మెటా సొంత యాప్ అయిన ఇన్‌స్టాగ్రామ్ వీడియో ఎడిట్స్‌ (Edits App) పేరుతో ఎడిటింగ్ యాప్ ను కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది. iOS యూజర్ల కోసం దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ యాప్ ను యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ రెండింటిలో ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సైన్ ఇన్ అవ్వడం ద్వారా వాడుకోవచ్చు.

ఎడిట్స్ యాప్ వల్ల వీడియో క్రియేషన్ చాలా ఈజీగా ఉంటుంది. ముఖ్యంగా ఇన్‌స్టా యూజర్లు తమ క్రియేటివిటీకి తగ్గట్లుగా ఇతర యాప్స్‌పై డిపెండ్ అవ్వకుండా సులభంగా వీడియోలను క్రియేట్ చేసుకోవచ్చు. సాధారణంగా ఏదైనా వీడియోలను క్రియేట్ చేయాలనప్పుడు.. పలు యాప్‌లు, వర్క్‌ఫ్లో అనేవి అవసరం అవుతాయి. ప్రస్తుతం ఇలాంటి ప్రక్రియను మరింత ఈజీ చేసేస్తుంది.

యాప్ ఫీచర్స్ ఇలా..
ఎడిట్స్ యాప్‌ ఫోన్ నుంచి నేరుగా హై క్వాలిటీ వీడియోలను క్రియేట్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ఇతర యాప్స్‌ అవసరం లేకుండా మొత్తం వీడియో క్రియేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. వీడియో ఎడిటింగ్‌ కోసం అవసరమైనవన్నీ ఒకే యాప్‌లో ఉండటంతో పాటు ఐడియాలను కూడా సేవ్ చేసుకోవచ్చు.
సింగిల్‌ క్లిక్‌తో టచ్‌ అప్‌, గ్రీన్‌ స్క్రీన్‌, మ్యూజిక్‌ క్యాటలాగ్‌, టైమర్‌, కౌంట్‌డౌన్‌ వంటి టూల్స్‌ను వినియోగించుకోవచ్చు.

ఎడిట్స్‌ యాప్‌ సాయంతో స్టిల్‌ ఇమేజ్‌లను కూడా ఏఐ (Artificial Intelligence) యానిమేషన్‌ సాయంతో వీడియోగా మారుస్తుంది.
గ్రీన్‌ స్క్రీన్‌, వీడియో ఓవర్‌ లే ఆప్షన్‌ ద్వారా బ్యాగ్రౌండ్‌ను మార్చుకోవచ్చు. అలాగే.. ఈ యాప్‌ బ్యాగ్రౌండ్‌ నాయిస్‌ను క్లియర్‌చేసి ఆడియోను బెస్ట్ గా అందిస్తుంది.
ఎడిట్స్‌లో ఎడిట్‌ చేసిన వీడియోలను మెటా యాప్స్‌ అయిన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాలో వెంటనే షేర్‌ చేసుకోవచ్చు.

ఈ వీడియోను వాటర్‌మార్క్‌ లేకుండా ఇతర ప్లాట్‌ఫామ్స్‌లోనూ యూస్ చేసుకోవచ్చు. క్వాలిటీ కెమెరా, పర్‌ఫెక్ట్‌ ఫ్రేమ్, టైమ్‌లైన్, కటౌట్‌, ఏఐ యానిమేషన్ల వంటి టూల్స్ ఉపయోగించి వీడియోలను ఇన్నోవేటివ్ గా క్రియేట్ చేసుకోవచ్చు.