గూగుల్ ఏఐ మోడ్.. స్పెషాలిటీ ఏంటంటే..?!

Google AI Mode: గూగుల్ కొత్తగా అమెరికాలో ఒక ప్రయోగంగా AI మోడ్ ఫీచర్ ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు దీనిని భారతదేశంలో కూడా ప్రారంభించడం విశేషం. ఈ సౌకర్యం ప్రస్తుతం Labs ఫీచర్ కింద ఇంగ్లీష్ భాషలో అందుబాటులోకి వచ్చింది. దీని స్పెషాలిటీ ఏంటంటే వినియోగదారులు టఫ్ అండ్ ఎక్సప్లేనేషన్ తో కూడిన ప్రశ్నలను అడిగినప్పుడు దానికి తగ్గ సమాధానం తెలుసుకునే అవకాశం ఉంటుంది.

ఈ మధ్యకాలంలో లెన్స్, వాయిస్ సెర్చ్ తో భారతదేశంలో సెర్చ్ చేసే వారి సంఖ్య పెరుగుతుందని గూగుల్ ఓ సర్వేలో తెలిపింది. అందుకే మీరు AI మోడ్‌లో మీ వాయిస్ లేదా ఫోటోతో పాటు ఎలాంటి ప్రశ్నలనైనా అడగవచ్చు. ఉదాహరణకు ‘ఇది ఏ మొక్క? దీన్ని ఎలా తిరిగి నాటాలి? ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి’ అనే ప్రశ్నలను అడినప్పుడు.. AI మోడ్ వెంటనే సమాధానం ఇవ్వడమే కాకుండా, దీని తర్వాత దానికి సంబంధించిన తదుపరి ప్రశ్నల ఫీడ్ ను కూడా అందిస్తుంది. అంతేకాదు.. దీనికి ముందు ఇచ్చిన సందర్భాన్ని కూడా రిఫరెన్స్ గా చూపిస్తుంది. Google AI Mode.

ఈ ఫీచర్ Google జెమిని 2.5 ఆధారంగా పని చేస్తుంది. ఇది క్వెరీ ఫ్యాన్ అవుట్ టెక్నిక్ తో తయారైంది. ఇది మీ ప్రశ్నను చిన్న చిన్న టాపిక్స్ గా డివైడ్ చేసి, ఒకేసారి అనేక రిజల్ట్స్ ను అందిస్తుంది. ఈ క్రమంలో మీరు రీసెంట్ అండ్ అక్యురెట్, అనలైజ్డ్ జవాబులను పొందవచ్చు. AI మోడ్‌ని ఉపయోగించి, మీరు రియల్ టైం డేటా, నాలెడ్జ్ గ్రాఫ్ నుంచి ఇన్ఫర్మేషన్ ను పొందుతారు.

అలానే మిలియన్ల కొద్దీ ప్రొడక్ట్స్ గురించి షాపింగ్ సంబంధిత సమాచారాన్ని కూడా ఇట్టే పొందవచ్చు. దీనికి మల్టీమోడల్ సపోర్ట్ ఉంది. అంటే మీరు మాట్లాడటం, రాయడం లేదా ఫోటోను అప్‌లోడ్ చేయడం ద్వారా దీన్ని ఉపయోగించవచ్చన్నమాట.

ఏఐ మోడ్‌ను ఎలా ఉపయోగించాలంటే..
ముందుగా మీరు బ్రౌజర్‌కి వెళ్లి labs.google.com. సెర్చ్ చేయాలి. అప్పుడు AI మోడ్ అనే దానిని గుర్తించి ఆన్ చేయాలి. ఇప్పుడు ట్రై AI మోడ్ బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా కొత్త ఫీచర్‌ని ఉపయోగించవచ్చు. లేదంటే Googleలో ఏదైనా విషయం గురించి సెర్చ్ చేసినా సరే మీకు సమాచారం లభిస్తుంది అంతే!

Also Read: https://www.mega9tv.com/trending-news/teslas-first-autonomous-car-delivery-from-company-to-customer-home-goes-in-self-drive-mode/