
విమానంలో ఉండే బ్లాక్ బాక్స్ నిజంగా నల్లగా ఉంటుందా. అసలు దానికి బ్లాక్ బాక్స్ అనే పేరుఎందుకు వచ్చింది. బ్లాక్ బాక్స్ అనేది విమానం వెనుక భాగంలో ఉంటుంది. వాస్తవంగా ఇది ఆరెంజ్ రంగులో ఉంటుంది. బ్లాక్ బాక్స్… ఈ పదం రెండో ప్రపంచ యుద్ధం సమయంలో పుట్టింది. బ్రిటీష్ యుద్ధ విమానాల్లో మొదటగా వాడారు. ఈ బాక్సుకు తుప్పు పట్టకుండా, ఎండకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు నల్ల రంగు పూసేవారు. అప్పటి నుంచి దానికి బ్లాక్ బాక్స్ అని పేరు వచ్చింది. అయితే ఆరెంజ్ కలర్ అన్నారు కదా అనుకోవచ్చు… అది కూడా చూద్దాం.
ఆరెంజ్ కలర్ బాక్సులోనే కీలకమైన ఆ బ్లాక్ బాక్స్ ఉంటుంది. అది సంగతి. ఇక ఎలాంటి వాతావరణంలో అయినా ఇబ్బంది లేకుండా, డ్యామేజ్ కాకుండా బ్లాక్ బాక్స్ డిజైన్ చేశారు. రాడార్ సిగ్నల్స్ అందని సమయంలో కూడా బ్లాక్స్ బాక్స్ పనిచేస్తూనే ఉంటుంది. విమాన ప్రమాద సమయంలో పైలెట్, ప్రయాణికులు ఏం మాట్లాడారు, ఎలాంటి సాయం కోరారు అన్నది రికార్డ్ చేస్తుంది. విమానం వెనుక భాగంలోనే బ్లాక్ బాక్స్ అమర్చడానికి కారణం ఒక్కటే, సేఫ్ ప్లేస్. ఎలా అంటే, ఏ విమానాలు అయినా ప్రమాదం బారిన పడితే వెనుక భాగం 99 శాతం దెబ్బతినదు. అంటే బ్లాక్ బాక్స్ కూడా దెబ్బతినదు. అందుకే వెనుక అమర్చుతారు.
ఇక ఈ బ్లాక్ బాక్సులో రెండు కీలక పరికరాలు ఉంటాయి. ఒకటి ఫ్లయిట్ డేటా రికార్డర్, రెండోది కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఫ్లయిట్ డేటా రికార్డర్లో విమానం సంబంధించిన పూర్తి సమాచారం రికార్డ్ అవుతుంది. అంటే విమానం ఎంత ఎత్తులో ఉంది, ఇంధనం ఎంత ఉంది, ఇంజన్ కండిషన్ వంటి కీలక విషయాలు రికార్డ్ అవుతాయి. అలాగే విమానం కదలికలను కూడా రికార్డ్ చేస్తుంది. అంటే, పైలెట్ గేర్ ఎప్పుడు వేశారన్నది రికార్డ్ అవుతుంది. ఇక కాక్పిట్ రికార్డర్ విషయానికొస్తే, ఇందులో పైలెట్ వాయిస్ రికార్డ్ అవుతుంది. అంటే, పైలెట్ ఏటీసీతో ఏం మాట్లాడారు అన్నది రికార్డ్ అవుతుంది. మరో విషయం ఏంటంటే, ప్రమాదం జరగడానికి అరగంట ముందు ఏం జరిగిందన్నదే కీలక అంశం. అంటే, ప్రమాద సమయంలో ఏటీసీకి మెసేజ్ వెళ్లిందా, ఏం మాట్లాడారన్న ముఖ్య విషయాలు రికార్డ్ అవుతాయి.
వాటిని డీకోడ్ చేసిన తర్వాతే ప్రమాదం ఎలా జరిగిందన్నది క్లారిటీ వస్తుంది. ఇక బ్లాక్ బాక్సులో 13 గంటల పాటు డేటా రికార్డ్ చేసే సామర్ధ్యం ఉంటుంది. అందుకే విమానంలో అది చాలా కీలకం. ఇక ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వారెన్ అనే ఎయిరోనాటికల్ శాస్త్రవేత్త 1954లో బ్లాక్ బాక్స్ కనిపెట్టారు. తన ఇంట్లో ఉన్న మ్యూజిక్ రికార్డర్ సాయంతో దీన్ని కనిపెట్టారు. ఇక బ్లాక్ బాక్స్ నాశనం చేయడం కుదిరేపనికాదు. బద్దలు కొట్టాలని ప్రయత్నించినా, కాల్చాలని చూసినా అందులోని డేటా డిలీట్ కాదు. ఎందుకంటే, అందులో చాలా చిన్నచిన్న మైక్రోచిప్స్ ఉండటమే అందుకు కారణం. అంతేకాదు, ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా జరిగే పనికాదు. 1976లో బ్లాక్ బాక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఇక మన దేశంలో వాడే బ్లాక్ బాక్స్ ఏబీసీ నెట్ వర్క్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్సార్ కంపెనీలు సంయుక్తంగా తయారు చేసినవి.