నగదు బదిలీ తప్పుగా జరిగితే ఏం చేయాలి..?!

money transfer goes wrong just complaint to NPCI: ఈరోజుల్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) రాకతో డబ్బుల బదిలీ చాలా తేలికపోయింది. ఒకప్పుడు ఏది కావాలన్నా, ఏం కొనాలన్నా.. ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకొని వాడుకోవాల్సి వచ్చేది. ఈ డిజిటల్ పేమెంట్ పుణ్యమా అని.. 10 రూపాయల వస్తువుకు కూడా ఆన్లైన్ పేమెంట్ చేస్తూ.. టైంను ఆదా చేస్తూ అందరికీ సౌకర్యవంతంగా మారింది. ఎంత డెవలప్ అయినప్పటికీ కొన్నిసార్లు టెక్నాలజీ వల్ల కూడా ఇబ్బందులు ఏర్పడతాయి కదా. అలానే ఈ యూపీఐ పేమెంట్ విషయంలోనూ టైపింగ్ లో పొరపాట్లు అయి ఉండొచ్చు, క్యూఆర్ కోడ్ ఎర్రర్ అయి ఉండొచ్చు.. కొన్నిసార్లు తప్పు యూపీఐ ఐడీకి డబ్బులు పంపించే ప్రమాదమూ ఉంది. ఇలాంటి తప్పులు చేసినప్పుడు ఆందోళన చెందకుండా చేయాల్సినవేంటో, చేయకూడనివి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం:

తప్పు నంబర్ కు లేదా కొత్త నంబర్ కు డబ్బులను సెండ్ చేసిన వారి ఫోన్ నంబరు యూపీఐ ఐడీతో లింక్ అయ్యి ఉంటే వారితో నేరుగా మాట్లాడొచ్చు లేదంటే మెసేజ్ అయినా పంపొచ్చు. పరిస్థితిని మర్యాదగా వివరించి, డబ్బులను తిరిగి పంపాలని కోరవచ్చు. కొన్నిసార్లు వాళ్లు వెంటనే సహకరించొచ్చు.

యూపీఐ యాప్ రిపోర్టు ద్వారా..
గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, భీమ్ వంటి పాపులర్ యూపీఐ యాప్ లన్నింటిలో యాప్ రిపోర్ట్ సపోర్టు ఆప్షన్లు అనేవి ఉంటాయి. ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి వెళ్లి తప్పుడు లావాదేవీని ఎంచుకొని ‘రెయిజ్ ఎ డిస్ప్యూట్’ లేదా ‘రిపోర్టు యాన్ ఇష్యూ’ను ఎంచుకోవాలి. ట్రాన్సాక్షన్ ఐడీ, యూపీఐ ఐడీ, చెల్లించిన మొత్తం, పేమెంట్ చేసిన డేట్ వంటి వివరాలు ఇందులో ఇవ్వాలి. ఎంత త్వరగా రిపోర్టు చేస్తే అంత ఛాన్స్ ఉంటుంది.

బ్యాంకు ద్వారా..
తప్పుడు ట్రాన్సాక్షన్ అయినట్టు గమనించిన వెంటనే బ్యాంకు కస్టమర్ సర్వీస్ ను సంప్రదించి, ఎర్రర్ ను రిపోర్టు చేయాలి. సాధారణంగా బ్యాంకులు యూపీఐ వివాదాల పరిష్కార యంత్రాంగాలను కలిగి ఉంటాయి. అందువల్ల ఫిర్యాదు అందిన వెంటనే డబ్బులను వెనక్కి పంపించే ప్రక్రియను స్టార్ట్ చేయవచ్చు. ఇందుకోసం రాతపూర్వకంగా తెలియజేయాలని లేదా సమీపంలోని శాఖను సందర్శించాలని అయినా మీకు చెప్పొచ్చు.

ఎన్ పీసీఐలో ఫిర్యాదు ద్వారా..
యాప్ లేదా బ్యాంకు సహకరించకపోతే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. www.npci.org.in అనే అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి, డిస్ప్యూట్ రిడ్రెసల్ విభాగం కింద కంప్లయింట్ ను రైజ్ చేయాలి. లావాదేవీ వివరాలను ఇందులో తెలియజేయాలి. ప్రూఫ్ గా స్క్రీన్షాట్ లేదా బ్యాంక్ స్టేట్మెంట్లను అప్లోడ్ చేయాలి. money transfer goes wrong just complaint to NPCI.

ఆర్ బీఐ అంబుడ్స్మన్ ద్వారా..
ఈ సమస్య నెల దాటినా పరిష్కారం కాకపోతే మాత్రం అర్బీఐ అంబుడ్స్మన్ సాయం తీసుకోవచ్చు. ఆర్బీఐ సీఎంఎస్ పోర్టల్ ద్వారా అంబుడ్స్ మన్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లో ఫిర్యాదు చేయొచ్చు. ముఖ్యంగా వెనక్కి రావాల్సిన డబ్బు పెద్ద మొత్తంలో ఉంటే గనుక ఇది ఉపయోగపడుతుంది.

ఇకపై జాగ్రత్తగా ఉంటే మేలు..
లావాదేవీని కన్ఫర్మ్ చేసేముందు యూపీఐ ఐడీ, మొత్తాన్ని ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకోవాలి.
ఐడీని ఎంటర్ చేశాక రిసివర్స్ పేర్లను ధ్రువీకరించుకోవాలి.
క్యూఆర్ కోడ్స్ ను స్కాన్ చేసేటప్పుడు ఇంకా అలెర్ట్ గా ఉండాలి. తెలియని యూపీఐ లింకులను క్లిక్ చేయవద్దు. అప్రమత్తంగా ఉండాలి.

Also Read: https://www.mega9tv.com/technology/sam-jony-introduce-io-no-screen-no-need-to-google-but-it-works-like-ai-what-is-it/