
యూట్యూబ్ లో షార్ట్స్ చూస్తుంటే ఒక్కోసారి సమయమే తెలియదు. కొన్నిసార్లు వాటిల్లో కనిపించే ప్రాంతాలు, విచిత్రాలు కనిపిస్తుంటాయి. కొందరు తమ టాలెంట్, మీమ్స్ తో అలరిస్తారు. ఒక్కోసారి ప్రముఖ పుణ్యక్షేత్రాలు, సేదతీరే విడిదిలను చూపిస్తారు. అబ్బా.. అవెక్కడ ఉన్నాయో, ఎలా వెళ్ళాలో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ పుడుతుంది.
కానీ అది ఎన్నిసార్లు పర్ఫెక్ట్ సెర్చ్ రిజల్ట్స్ ను ఇవ్వవు. అలాంటప్పుడు ఇలాంటి ఇబ్బందిని తొలగించేందుకు యూట్యూబ్ షార్ట్స్ కు ఇప్పుడు గూగుల్ లెన్స్ జత కానుంది. ఇప్పటికే యూట్యూబ్ దీన్ని టెస్ట్ ట్రెయిల్ చేస్తుందట. ఇది పొట్టి వీడియోల్లో కనిపిస్తున్నవాటిని వెతికేందుకు యూజర్స్ కు హెల్ప్ చేస్తుంది.
ఉదాహరణకు, షార్ట్స్ లో కనిపించే కొత్త ప్రాంతాలను, వస్తువులను ఎంచక్కా ఈజీగా సెర్చ్ చేయొచ్చు. టెక్స్ట్ ను ట్రాన్స్ లేట్ చేసుకోవచ్చు. ఇలా వాటి గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
ఇందుకోసం షార్ట్స్ ను పాజ్ చేసి లెన్స్ గుర్తును తాకి.. ఆయా వస్తువులు, ప్రాంతాల మీద ట్యాప్ చేస్తే చాలు లేదా వాటి చుట్టూ ఒక సర్కిల్ ని గీసి అయినా లెన్సును అడగొచ్చు. మరి కొద్దివారాల్లోనే ఇది అందరికీ అందుబాటులోకి రానుందట.
అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం మొబైల్ యాప్ కే పరిమితం అని తెలుస్తుంది. అంటే, ఒక్క మొబైల్ లోనే సపోర్ట్ చేస్తుందన్నమాట.