కాంగ్రెస్‎లో కులాల కుంపటి..!

తెలంగాణ కాంగ్రెస్‌లో మరో ముసలం మొదలైందా? రహస్య సమావేశాలు పెట్టొద్దన్న అధిష్ఠానం ఆదేశాలను నేతలు ధిక్కరిస్తున్నారా? మాదిగ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు గుర్తుతెలియని ప్రదేశంలో రహస్యంగా భేటీ కావడం వెనుక కారణమేంటి? ఈ ఎమ్మెల్యేల ప్రధాన డిమాండ్‌ ఏంటి? ఈ సీక్రెట్ సమావేశంపై తెలంగాణ ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ రియాక్షన్ ఏంటి? అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ఇన్ దిస్ ఆఫ్ ది రికార్డ్

మంత్రి వర్గ విస్తరణలో మాదిగ సామాజిక వర్గానికి చోటు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలంతా రహస్యంగా భేటీ కావడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మందుల సామేలు,కవ్వం పల్లి సత్యనారాయణ,అడ్లూరి లక్ష్మణ్,కెప్టెన్ లక్ష్మీ కాంతారావు,వేముల వీరేశం ఈ రహస్యంగా భేటీలో పాల్గొనడంతో అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది అనే చర్చ సీరియస్ గా మొదలైంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, పీసీసి చీప్ మహేష్ కుమార్ గౌడ్ ల ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత.. ఇవాలో,రేపో మంత్రి వర్గ విస్తరణ,పీసీసి కార్యవర్గం ఉంటుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇలా మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం రేవంత్ కులగణనతో పాటు మాదిగలకు ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణ చేపట్టారు. ఈనేపధ్యంలో మాలల కంటే మాదిగ సామాజిక వర్గం తెలంగాణలో ఎక్కువ ఉంది కాబట్టి తమకు జనాభా ప్రాతిపదికన మంత్రి వర్గం లో చోటు కల్పించడం తో పాటు పీసీసి కార్యవర్గంలో అవకాశం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మాల సామాజిక వర్గానికి చెందిన భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం ఇచ్చారు . గడ్డం ప్రసాద్ కు స్పీకర్ పదవి ఇచ్చారు కాబట్టి ఈసారి మంత్రి వర్గ విస్తరణలో మాకు చాన్స్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒక వైపు మాలలు అంటే మాకు గౌరవం అంటూనే ఆ సామాజిక వర్గాన్ని ఇన్ డైరెక్టు గా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని అంటున్నారు. దీనితో ఈ విషయం హై కమాండ్ కు తలనొప్పిగా మారింది.

ఈ సారి మంత్రి వర్గ విస్తరణలో మాల సామాజిక వర్గానికి చెందిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామికి బెర్త్ కాన్ఫామ్ అని పార్టీలో చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆయన బీజేపీ పార్టీ నుండి కాంగ్రెస్ లో వచ్చే ముందు మంత్రి పదవి హామీతోనే కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడని టాక్ . ఇదే క్రమంలో మాదిగ సామాజిక వర్గ నేతలు ఈ సారి మాదిగలకు చోటు కల్పించాలని హై కమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ అనంతరం ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ను కలిసి తాడో పేడో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారట. ఒక వేళ మీనాక్షి నటరాజన్ నుండి హామీ రాకపోతే ఢిల్లీ వెళ్లి హై కమాండ్ పెద్దలను కలవాలని భావిస్తున్నారట.

మొత్తానికి మంత్రి వర్గ విస్తరణ నేపథ్యంలో మాల,మాదిక సామాజిక వర్గ పంచాయితీ హై కమాండ్ కు కొత్త తలనొప్పిగా మారింది, ఒక వైపు ప్రతి పక్షాల విమర్శలు, మరొక పక్క సొంత పార్టీలోనే పదవుల లొల్లి తో కరువమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపంలాగా మారింది హై కమాండ్ పరిస్థి. మరి ఈ సారి ఏ సామాజిక వర్గానికి మంత్రి వర్గ విస్తరణ లో చోటుదక్కుతుందో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.